పుట:Bhoojaraajiiyamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

భోజరాజీయము ఆ శ్వా. 5


శిలఁ గని మది నద్భుతసం
చలములు దలకొనఁగ బహువిచారవివశుఁడై.

105


చ.

'దనుజునివంకవాఁ డొకఁడు దాఁ బగ వీఁగఁ దలంచి పొంచి యేఁ
జనుపథ మిట్లు చేసెనొకొ, చంపెనొకో గుణశాలిఁ గుంభి, నే
మనఁగల దాసుమిత్రసుతుఁ డన్నపిఱుందఁ జరించునట్లు నా
వెనుకను వచ్చుచుండుఁ దుది వీఁడును నేమయిపోయేనో కదే!'

106


వ.

అని యతని నుద్దేశించి మఱియును.

107


చ.

కవలునుబోలె నొప్పుచును గౌతుకమందఁగ నీస్వయంవరో
త్సవమను పేరు చెప్పి కడు దవ్వుగఁ దెచ్చె కృపావిహీనుఁడై
తివిరి దురంతదుర్దశలఁ దెచ్చె విరించి భవద్వియోగసం
భవపరితాప మేమిగతిఁ బాయునోకో యవి విహ్వలింపఁగన్.

108


ఉ.

ఆతనియార్తిఁ జూచి మనుజాధిపనందన లందఱు న్మనః
ప్రీతిగఁ దద్గుణావళులు పేర్కొని యి ట్లని పల్కి 'రేల యీ
రీతి నధీరున ట్లవధరించెదు, తాల్మి వహించి లెమ్ము నీ
యాతత భాగ్యసంపదకు నడ్డము గల్గునె యెందు నెన్నఁడున్.

109


క.

ఆపదలు గాఁపులుండవు,
చూపులకు [1]గులాద్రులట్లు చుట్టుకొనుఁ, దుదిన్
రూ పేది విరిసిపోవు మ
హాపవనాహతపయోధరావలి భంగిన్.

110


వ.

కావున నిశ్చింతుఁడవై మమ్మింతవట్టువారిని నీవారినకాఁ బరిపాలింపు' మనిన
నీవేళ కిదియ కార్యంబనుచు నతం డంద యుండె, నంత నొక్కనాఁ డొక
కిరాతుండు వేఁటమెయి వచ్చి యచ్చేరువ మెలంగుచుండి మున్ను కుంభి
యనుమతిం బట్టి బలాత్కారంబునఁ దిగిచి తోఁకొనిపోవునప్పు డప్పడంతి
కరంబుననుండి యూడిపడి తత్ప్రాంతం బంతయుం దనమయంబకాఁ బ్రజ్వ
లించు నొక్క యనర్ఘరత్నంబు గని పుచ్చుకొని యాశాలబ్ధుండై మఱియు
నేమేమి విశేషంబులు గందునో యని [2]పరికించువాఁ డెదుర నగ్గుండు గని

  1. గులాద్రియట్లు
  2. పరికించుచు