పుట:Bhoojaraajiiyamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

91


శరుఁ డోడరేవుపడఁతిని
మరుగుటఁ గనువేదు ఱితరమర్త్యుల వశమే!

82


తే.

నాకుఁగా నీతఁ డిటు మరణంబు నొందె
నేని నా కెంత పాపమో, యిప్పు డితని
కోర్కి దీర్చితినేని నా కులములోన
నెంత హీనత వచ్చునో యేమి సేతు.

83


వ.

నని చింతించి యొక్క యుపాయంబు [1]గాంచి.

84


క.

తొడ చఱచి పేరఁ బిల్చుచు
నొడికంబుగఁ గరసరోజ మురమున నిడుచున్
వెడఁ గదలుఱెప్ప పొడ గని
వడఁతుక యొకకొంత డిందుపడియెడు వగతోన్.

85


క.

'అనఘా! యిది యెంతటి పని,
విను నా దెస నీకు నింత వేడుక గలదేఁ,
గను దెఱచి చక్కఁ జూడుము
మనలో మన కింత గలదె మతిహీనుఁడవై.

86


క.

నవ్వితి వై నను గాకే
నివ్విధ మి ట్లెఱుఁగుదును మహీసుర! నిను నే
నొవ్వం బలికితిఁ గరుణకు
దవ్వగుపని సేయ నేను ధర్మేతరనే.”

87


చ.

అనిన నతండు “నావలన నాదరణంబు తలంచియిట్లు [2]పే
ర్కొనియెడుఁ ; గంటి మంటి" నని గొబ్బునఁ గన్నులు విచ్చిచూచి పై
కొనఁగఁ దలంచినం గుసుమకోమల తత్తఱపాటు లేని నె
మ్మనమున విప్రుఁ జూచియిటు మానుము నీ కిఁక వేగ మేటికిన్.

88


క.

ఏ నొక్కటి నిను వేఁడెద
దానిం గాదనక నీవు దలకొని చేయం
గా నోపిన విద్వద్విను
తా! నీచిత్తంబుఁ బట్టుదానఁ బ్రియమునన్.'

89
  1. గావించి
  2. పేర్కొనియెదు