పుట:Bhoojaraajiiyamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

51


క.

అప్పొలఁతి చూచి నయనము
[1]లొప్పెడుకమలములు వోలె నున్నవి, యిది యే
చొప్పో కానం డట యితఁ
డప్పా! యిట వచ్చి చూడు మని చూపుటయున్.

150


క.

చూచి యితం డగుఁ బో మన
చూచినపని కనుచు వానిచూపుల సత్వం
బేచందమొ యని తెలియం
జూచుటకయి పెంచిలో నశుద్ధము కలియన్.

151


ఉ.

వైచినఁ బ్రత్యయార్థముగ [2]వాఁ డది ప్రీతి భుజింపఁ బోయినం
జూచి కరంబు పట్టుకొని శుద్ధము కన్నులు చెడ్డవాఁడకాఁ
జూచుచుఁ జెట్ట పట్టుకొని స్రుక్కక యింటికిఁ దెచ్చి నవ్వుచున్
వాచవు లైన భోజ్యములు వానికిఁ బెట్టుచు నే ర్పెలర్పఁగన్.

152


ఆ.

వలయుమందు లెల్ల వానిచే నూరింప
నతఁడు తోడుతోన యన్నిక్రియలు
నెఱిఁగి యొక్కనాఁడు తెఱవసమ్ముఖమున
నిలిచి నేత్రరుచులు నివ్వటిలఁగ.

153


ఉ.

'సింధురయాన! యేను నినుఁ జెంది కృతార్ధుఁడ నైతి. నన్ను నీ
వంధునిఁగాఁ దలంచి యిటు లన్నియుఁ జూపఁగ, నీప్రసాదసం
బంధము పేర్మిఁ జేసి పరిపాటి నెఱింగితి ధూమవేధి యే
నంధుఁడఁ గాను సిద్ధుఁడఁ జు మమ్మ! వధూమణి! పోయి వచ్చెదన్.'

154


క.

అనవుడు సిగ్గును గోపం
బును మదిఁ బెనఁగొనఁగ మోసపోయితిన కదా!
నను నితఁ డిట్లు ప్రమోషిం
చినదానికి మాఱు చేయఁ జెల్లదె' యనుచున్.

155


ఉ.

చేతులు మోడ్చి నిల్చి తనచిత్తము నైక్యము చేసి 'మద్గురుం
డాతతసత్యశాలి యగు టారయ నిక్కమ యయ్యె నేని నే

  1. లొప్పెడు చెలువంబు వలెను నున్నవి
  2. వా డతి ప్రీతి