పుట:Bharatiyanagarik018597mbp.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యను సమస్యలకు సరియగు సమాధానముల నొసంగవలనుపడదు. పైకట్టడముల లక్షణము లన్నియు నిందుగలవు. యీ యాలయ మనిర్వాచ్యమును, వర్ణానాతీతమునగు నొక శిల్పవినోదము. ఇందు శిల్ప కేవలమును మతావేశ పూరితుడై తన యావేశమునంతటిని వ్యంగ్యమును,విస్మయకరమునగు శిల్నముగ బరిణమింపజేసెను. ఇందు గృత్రిమత్వ మిసుమంతము లేదు. అయినను కళానైపుణ్యమున కేమియు కొదవలేదు. నిశ్చలమును, గంభీరమునగు నిచటికళ ప్రేక్షకులకు నూతనమగు భావప్రబోధమును గల్గించుచున్నది. సుప్రసిద్ధ కళాభిజ్ఞుడగు హావెల్ (Havell) పండితుడు గ్రీసుదేశ శిల్పశిఖామణియగు 'పార్దినస్‌' శిల్పమున కీయాలయ మిసుమంతయు దీసిపోదని వ్రాసియున్నాడు.

తారా దేవాలయము

దీనికి 'చండికలస్సస్‌' అనిపేరు. ఈ యాలయము గూడ క్రీ. శ. 8 వ శతాబ్దముననే మహాయాన బౌద్దమత మీద్వీపమునం దుచ్చ దశలోనుండినపుడు నిర్మింపబడినది. ఇచ్చటి యొక శాసనమునుండి క్రీ. శ. 778 లో సుమాత్రా దీవినుండి విశాలరాజ్యము నేలిల శైలేంద్ర వంశీయుడగు నొకరాజు తారా యను బౌద్దదేవీవిగ్రహము నిచటయాలయమున బ్రతిష్ఠించెనని తెలియుచున్నది. ఈయాలయశిల్పము బొరొబుదుర్ శిల్పము ననుసరించుచున్నది.

చండీ సేపూ

యవద్వీపమునందు బౌద్దమతము క్రీ. శ. 8, 9 శతాబ్దములలో ప్రబలముగ నుండినను, హిందూమతముగూడ వర్దిల్లుచుండెను. చండీ సేపూయనగా వేయిగడులని యర్దము. ఇవియన్నియు శిథిలావస్థలో నున్నవి. బొరొబుదుర్‌కు సమీపమున 'చండీబనన్‌' యను శివాలయము గలదు. ఇందు శివ, విష్ణు, బ్రహ్మ, అగస్త్య విగ్రహములున్నవి. వీనికిని