పుట:Bharatiyanagarik018597mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములచే తల్లిని మరపించి, బిల్వతిక్త రాజ్యము నొక మహాసామ్రాజ్యము నొనరించెను. గజమదు డీకాలమునగూడ మంత్రిగనుండెదు. అకాలమున జావా, న్యూగినీదీవులును, వాని మధ్యనుండు ద్వీపములు, బోర్నియో, సెలిబెస్, బుటన్, బురు, పెరం, బంద, మొలక్క, టలట్, ద్వీపములును కెడ, కెలంగ్, సింగపూర్, పహాన్‌గ్, కెనన్‌టన్ మున్నగు మలేభాగములును, సుమాత్రాద్వీపములోని శ్రీవిజయ రాజ్యము - ఇవియన్నియు బిల్వతిక్తపుర సామ్రాజ్యమున జేరియుండినవి. వీనిని జయించుటలో నలుడను నౌకాబలాధికారి గజమదమంత్రి కెక్కుడుగ తోడ్పడెను. ఇంతియగాక నయాంలోని అయోధ్య రాజపురి రాజ్యములును, మరుత్మ, కాంభోజ, చంప, యవన, (ఉత్తర అనాంలోనిది) మున్నగు రాష్ట్రములును, బిల్వతిక్త సామ్రాజ్యముతో మైత్రిని బాటించినవి. సామంతద్వీపములన్నియు నేటేటను గప్పములను జెల్లించుచుండెడివి. వాని యోగక్షేమములనరయుటకై పురుక్ చక్రవర్తి మంత్రులు, భుజంగులు నను నుద్యోగులను నియమించుచుండెను. ఈ భుజంగులలో శైవభుజంగులు, బౌద్దభుజంగులు నని రెండు తెగలుండెడివి. వీరు రాజకీయ ధర్మములను నిర్వర్తించుటయేగాక తమతమ మతములనుగూడ బ్రవర్తింపుచుండిరి. రాజాజ్ఞల నుల్లంఘించువారిని జలధిమంత్రులు (Admirals) శిక్షించుచుండిరి. రాజబంధువులు వివిధభాగములను బ్రతినిధులుగ నేలుచుండిరి. చక్రవర్తి పట్టమహిషికి శ్రీపరమేశ్వరి యను బిరుదముండెడిది. రాజధానీనగర ముద్యానములతోడను, కేసరీచంపకాది వృక్షములతోడను, చక్కని బజారులు, హర్మ్యములు భవనములు మున్నగు వానితోడను విరాజిల్లు చుండెడిది. అందలి ప్రాగ్భాగమున బ్రాహ్మణులును, దక్షిణమున బౌద్దులును, పశ్చిమమున క్షత్రియులు రాజోద్యోగులు మొదలగువారును నివసించుచుండిరి. ఈ రాజ్యమునందలి ధనికులుమాత్రమే బౌద్దమతము నవలంభించిరి. ప్రజాసామాన్యమున హిందూమతమే ప్రబలినది.