పుట:Bharatiyanagarik018597mbp.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బిల్వతిక్త రాజ్యము

ఇటుల శత్రువులెల్లరును నిర్జించి విజయుడు క్రీ. శ. 1294 లో 'కృతరజన జయవర్ధన' యను బిరుదముతో దానిధివరలో నిర్మించిన బిల్వతిక్తి (మజపహిత్) నగరమున సింహాసనము నధిష్ఠించెను. ఇంతటినుండియు నీ నూతన రాజ్యచరిత్ర మారంభమగును. కృతరజసునిపుత్రు డవినీతిపరుడు. అతనికి బిమ్మట నాతని చెల్లెలగు త్రిభువనోత్తుంగ దేవీ జయవిష్ణువర్దని యనునామె రాజ్యమునకు వచ్చెను. ఈమె చెలియలగు రాజదేవియు మాతయగు గాయత్రీ దేవియుగూడ రాజ్యసన్మానము నందుచుండిరి. విష్ణువర్దని దేవిభర్త రాజ్యమునకంతటికిని ప్రథాన న్యాయాధిపతిగా నుండెను. రాణికి బిమ్మట గజమదుడను బ్రధానమంత్రి ముఖ్యుడుగ నుండెను. ఒక నాడీమంత్రిపుంగవుడు పశ్చిమ జావా, బాలి, బకుళపురము, సుమాత్రా, సింగపుర రాజ్యములను జయించినగాని తనయాస్తిలో నొక చిల్లిగవ్వనైనను ముట్టనని శపథమొనర్చెను. రాణియాజ్ఞను బడసి యాతడు క్రీ. శ. 1343 నాటికి బాలిద్వీపపాలకుని జయించి, యాతని పాలనమునందుండిన జావాకు తూర్పునగల ద్వీపములను, మధుర యను దీవిని, సెలిబిస్ ద్వీపమున గొంతభాగమును వశపరచుకొనెను. వాఙ్మయమును శిల్పమునుగూడ నారాజ్ఞి పెంపొందించెను. శాంతి సౌఖ్యము లెల్లడలను బ్రబలినవి. ఈమె సర్వవిధములను భారతదేశ రాజ్ఞీమణులగు కాకతీయరుద్రాంబ, రెజీయబేగం మున్నగు వారిని జ్ఞప్తికి దెచ్చుచున్నది. క్రీ. శ. 1350 లో నీమెతనయుడగు హ్యంవురుక్ (Hyam Wuruk) ప్రాయమునందుటతోడనే రాజభారము నాతనిపైనుంచి తన యైహిక ప్రవృత్తిని జాలించెను. అంతట నీరాజపుత్రుడు శ్రీరాబననగరయను బిరుదముతో మజదహిత్ లేక బిల్వతిక్త రాజ్యమును బరిపాలింప మొదలిడెను. వగరకృతాగమ, పరరటన్ అను కావీగ్రంథములనుండి యీతని రాజ్యకాలచరిత్రము దెలియనగుచున్నది. ఈతడు బలపరాక్రమ