పుట:Bharatiyanagarik018597mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవతార పురుషుడుగ బరిగణింప బడుచున్నాడు. మహాభారత యోధులలో నీతడుగూడ బేర్కొనబడియున్నాడు, భావికాలమున నాతడు తిరిగి జావా ద్వీపమున కేతెంచి దర్మము నుద్దరించునని యచటివారి నమ్మకము. జయభయరాజు వైష్ణవుడు. ఈకెదిరిపాలకులు విదేశములందు సహితము తమ ప్రతిభను నెలకొల్పిరి. అరభ్ దేశీయుల వ్రాతలనుండి జావావాసులా కాలమున ఆఫ్రికాఖండమున మెడగాస్కర్ ద్వీపమున కెదురుగనున్న పోఫల దేశముతో వర్తకము నెఱపుచుండిరని తెలియుచున్నది. జావారాజుల కొలువులో నెందరో నీగ్రోలు బానిసలుగ నుండిరి. Ferrand అను పండీతుడు క్రీ. శ. 1 వ శతాబ్దముననే జావా సుమాత్రాదీవులనుండి హిందువులు మెడగాస్కర్ దీవికి వలసపోయి యటస్థిరపడిరనియు, నటుపై 10 వ శతాబ్దమున మలేరాజ్యమునుండి మఱిగొందఱు హిందువులట కేగిరనియు వ్రాసియున్నాడు. 13 వ శతాబ్దప్రారంభమున నీ కెదిరి రాజ్యము నశించినది. ఈ కాలమున కెన్‌అరోక్ అను నొక మహాబలశాలి బయల్వెడలెను. స్వార్థపరుడై యాతడు తన మేథాబలములను దుర్మార్గముల నుపయోగించి తానొక విశిష్టమానవుడనని తలంచుచు, శౌర్యము, హత్య మున్నగువాని మూలమున స్వార్దము నభివృద్ధి పఱచుకొనుచుండెను. అంతట నాతని కొక బ్రాహ్మణుడు సహకారి యయ్యెను. కెదిరి రాజులకు సామంతులుగ సింగనరి రాజ్యము నేలుచుండిన రాజువద్ద నీక్రూరు డుద్యోగమును సంపాదించెను. అనతికాలముననే యీతడు మహా సౌందర్యవతియును, దనయేలిక భార్యయునగు డీడిస్ (Dedes) అనునామెను మోహించి, రాజును జంపి, యామెను పెండ్లాడి సింగనరి రాజ్యమును వశపఱచుకొనెను. పిమ్మట నీతడు కెదిరి, జంగల రాజ్యములను జయించెను. యింతటితో కెదిరి రాజ్యచరిత్రము ముగిసినది.