పుట:Bharatiyanagarik018597mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"సింహళమున సూర్యోదయమగునపుడు యవకోటిలో మధ్యాహ్నమును, రోమకదేశమునం దర్ధరాత్రమునై యుండు" నని వ్రాసియున్నాడు. అదేకాలమున రచింపబడిన 'సూర్యసిద్దాంత' మను జ్యోతిషగ్రంథమునందు "భూమియొక్క చుట్టుకొలతలో నాల్గవభాగమున, తూర్పుదిశకు స్వర్ణకుడ్యబ్వాశోభితమగు 'యవకోటి' యనునగరము గల" దని వ్రాయబడి యున్నది. క్రీ. శ. 8 వ శతాబ్దమున రచింపబడిన "మంజు శ్రీమూలకల్ప"మను బౌద్దగ్రంథమున జావా, బీలిద్వీపములలోని భాషయస్పష్టమైన దనియు, 'ర' యనుశబ్దమందు తరచుగ వచ్చుచుండుననియు జెప్పబడియున్నది. 'నవకనాడు^' అనునామాంతరముగల యవద్వీపమునందలి నాగపురమునందు ఇంద్రుని సంతతివారగు భూమచంద్ర, పుణ్యరాకయనువార లిర్వురు రాజ్యమేలిరని "మణిమేఖల" యను ద్రవిడకావ్యమున జెప్పబడియున్నది. క్రీ. శ. 11 వ శతాబ్దమునాటి యొక నేపాళదేశ లిఖిత గ్రంథమునందు "యవద్వీపమున దీపంకర అతిశుండు" అనుపేరిట నొక చిత్రము వ్రాయబడియున్నది. 'రసమాల' యను గుజరాతీ గ్రంథమున "జావాకుపోయినవాడు తిరిగిరాడు. అదృష్టవశమున దిరిగివచ్చినచో రెండు పురుషాంతములకు సరిపడువెండి మూటలతో వచ్చును" అను నొకసామెత గలదు. ఈ ప్రశంసలనుండి క్రీస్తుశకారంభమునుండియు హిందూదేశమునకును యవద్వీపమునకును సన్నిహితమగు సంబంథముండెడిదని స్పష్టమగుచున్నది.

మొదటి రాజులు

జావాద్వీపపు సమగ్ర చరిత్రమును రచించుటకు వలయుసాధనము లింకను లభింపవలసి యున్నవి. చైనా దేశీయుల వ్రాతలనుండియు జావా, బోర్నియో, సుమాత్రాదీవులందు దొరకిన శాసనముల నుండియు క్రీ. శ. 2 నుండి 10 వ శతాబ్దమువరకును గల యవద్వీపచరిత్రమునందలి