పుట:Bharatiyanagarik018597mbp.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇటుల ప్రాచీన భారతదేశముతో సన్నిహిత సంబంధమును గలిగియుండి, యిచ్చటి నాగరికతను విదేశములలో వ్యాపింపజేసి, బూర్వహిందూదేశముయొక్క విశ్వవిఖ్యాత ప్రవృత్తికి ప్రబలనిదర్శనమైయున్న యీ శ్రీ విజయపురాదీశ్వరులగు శైలేంద్రరాజుల చరిత్రము చిరస్మరణీయమై యొప్పుచున్నది.