పుట:Bharatiyanagarik018597mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాతని పుత్రుడగు మారవిజయోత్తుంగవర్మ దానిని బూర్తిచేసెను. అదేకాలమున రాజేంద్రచోళుడు సుమత్రాద్వీపముపై నొక నౌకాదళమును పంపి, యచ్చటిరాజగు సంగ్రామ విజయోత్తుంగుని జయించి, విశేషధనరాసులను కొల్లగొనెను. వీర రాజేంద్ర చోళుడుగూడ మరియొకతూరి యిటులే విజయమునందెను. ఉత్తరహిందూదేశ శాసనములలో గూడ సువర్ణద్వీప ప్రసంశగలదు. నాలందాలో 9 వ శతాబ్దినాటి యొక తామ్రశాసనము దొరకినది. దానినుండి, దర్మసేతువను శ్రీవిజయరాజు యవద్వీపరాజపుత్రికను వివాహమయ్యెననియు, వారి పుత్రుడగు మహారాజ బాలపుత్ర దేవుడు బుద్దభక్తుడగుటచే నాలందా విద్యాపీఠమునందొక విహారమును నిర్మించెననియు, దెలియుచున్నది. 10 వ శతాబ్దమున నాలందా విశ్వవిద్యాలయమునం దద్యక్షుడుగ నుండిన దీపంకర అతీశుడు స్వర్ణభూమికేగెను. ఆదేశపు రాజపుత్రు డొకడు జంబూద్వీపమున కేగి బుద్దగయలో ఆచార్యమహాశ్రీరత్నయను భిక్షువువద్ద ధర్మోపదేశమునంది, స్వదేశమునకు మరలి బౌద్దదర్మమును ప్రచారము చేసెను. అతీశుడు సుమాత్రాలో 12 సంవత్సరములుండి యాకాలపు బౌద్దపండితులలో నప్రతిముడగు దర్మక్రీర్తివద్ద తత్వమును నేర్చుకొనెను. 11 వ శతాబ్దమునాటి యొక నేపాళదేశ లిఖిత గ్రంథమున "స్వర్ణభూమిలోని శ్రీ విజయపురము నందు లోకనాథాచార్యుడు" అను శీర్షికతో నొక చిత్రముగలదు. బృహత్కథలో హిందూవర్తకులు స్వర్ణద్వీపముతో వాణిజ్యము సేయుచుండిరని యున్నది. యీ యాధారముల నుండి బూర్వము హిందూదేశమునకును సుమాత్రా ద్వీపమునకును సన్నిహితమగు సంబంధ ముండెడిదని తెలియుచున్నది.

శ్రీ విజయ రాజ్యము:

సుమాత్రా ద్వీపమున శ్రీ విజయమను పట్టణము రాజధానిగా నొక రాజ్యముండెడిది. దీనిని శైలేంద్ర వంశోద్భవులగు రాజులు పాలించు