పుట:Bharatiyanagarik018597mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బండితులు సమన్వయించియున్నారు. ఈ ద్వీపమున గుంటూరుజిల్లాలోని ఉండవల్లి గుహలవంటి గుహలుకూడ గలవు.

పైవిధముల భారతీయ నాగరికతను దేశాంతరములలో విస్తరించు నెడ నుత్తరాపథ దక్షిణాపథములు రెండును సమముగ బాల్గొనినవి. ఆఫ్‌గనిస్థానము, కాష్‌ఘర్, యార్‌కండ్, కోటాన్, టిబెట్, చైనా, జపాన్ దేశముల కుత్తరాపథమునుండియు, బర్మా, ఇండోచైనా, నయాం, మలేద్వీపకల్పము, జావా, బలి, సుమాత్రా, బోర్నియో, మొలక్కన్, సెలిబిస్ మున్నగు దేశములకు దక్షిణ హిందూదేశమునుండియు భారతీయ నాగరికత వ్యాపించినది. ఈ నాగరికతా విస్తరణమునందు బ్రాచీనాంధ్రులు విశేషముగ బాల్గొనియుండిరి. క్రీస్తుశకారంభమునుండి సుమారు పండ్రెండవ శతాబ్దమువరకునుగూడ భారతదేశము ఆసియాఖండమునందు సువిశాలమగు వైజ్ఞానిక సామ్రాజ్యము నేలుచు ప్రాచ్య ప్రపంచమున కధినేతయై యుండెను.