పుట:Bharatiyanagarik018597mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణాదిగ్రంథములను సమర్పించెను. రాజు శైవుడగుటవలనను, శక్తి పూజ యాకాలమున ప్రబలముగ నుండుటవలనను, రాజ్యమున శివాలయములుగూడ బయల్వెడలినవి. క్రీ. శ. 604 లో చిత్రసేనుడు మహేంద్రవర్మయను నామముతో కాంభోజసింహాసనమునకు వచ్చి యిరువదియేడు సంవత్సరములు పాలించెను. యీకాలమున నొక బ్రాహ్మణుడు శివపాదమును బ్రతిష్ఠించి దానిపై నొకయాలయమును గట్టించెను. ఇయ్యది హిందూదేశములోని విష్ణు బుద్దపాదముల యారాధన జ్ఞప్తికి దెచ్చుచున్నది. తరువాత రాజ్యమునకు వచ్చి క్రీ. శ. 627-639 నడుమ రాజ్యమేలిన యీశానవర్మకాలము మిగుల ముఖ్యమైనది. యీశానపుర, తామ్రపుర, చక్రాంకపుర, భీమపురాది నగరములెన్నియో యీసమయమున నిర్మింపబడినవి. శంకరనారాయణ పూజగూడ నీకాలమున వ్యాప్తినందినది. యీరాజు నీతనిసామంతులును బౌద్ధులసంఘారామములవలె హిందూ ఆశ్రమములను స్థాపించి వానిని కపోధరుల కాశ్రయములుగ నొనర్చిరి. క్రీ. శ. 665-690 నడుమ రాజ్యమేలిన మొదటి జయవర్మకాలమున బౌద్దమత మీదేశమును బ్రవేశించెను. క్రీ. శ. 8 వ శతాబ్దము కాంభోజచరిత్రమునం దందకారమయముగనున్నది. యీ కాలమున శంభుపురము, వ్యాధపురము, అనిందితపురము నను మూడు చిన్నరాజ్యములుగ దేశమంతయు విభజింపబడి యంత:కలహములకు లోనయ్యెను. క్రీ. శ. 802 లో రెండవ జయవర్మ శాంతిని నెలకొల్పి చంపారాజ్యము నంతటిని క్రీ. శ. 820 వరకు నేలెను. మహేంద్రపర్వతముపై నీత డొక నూతనరాజధానిని నిర్మించెను. రాజేంద్రదేవి, నరేంద్రలక్ష్మి యను వా రీతని భార్యలు. క్రీ. శ. 877-889 నడుమ పరిపాలించిన మొదటి యింద్రవర్మగూడ నెన్నియో యాశ్రమములను స్థాపించెను. పిమ్మట సింహాసనమునకు వచ్చిన యశోవర్మ కాంభోజపాలకులలో నగ్రగణ్యుడు. సామశివుడను మహామునికీతడు శిష్యుడు. ఈకాలమున జనులు శివుడు, విష్ణువు, శక్తి, గణపతి కార్తికేయుడు మున్నగుదేవతల నారాధించుచుండిరి. చాతుర్వర్ణవ్యవస్థ యీ