పుట:Bharatiyanagarik018597mbp.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భారతీయ నాగరికతా విస్తరణము.

7. కాంభోజ రాజ్యము.

ఈప్రాచీనహిందూరాజ్యము నేటి కాంబోడియాకు సరియగును. మొదటిలోనియ్యది యీనాటి కొచిన్, చైనా, నయాం, మలేద్వీపకల్పములకు వ్యాపించిన వూనన్ రాజ్యములో చేరియుండి క్రీ. శ. 600 లో స్వతంత్రరాజ్యమయ్యెను. యీ కాంభోజరాజ్యోత్పత్తినిగూర్చి వివిధములగు గాథలుగలవు. స్థానికులగు ఖ్మేర్ (Khmer) ప్రజలు కంబుస్వాయంభువను నార్యదేశపురాజు కాంభోజదేశమున కేగి, యొక నాగరాజుకూతురును పెండ్లాడి యాదేశమున కధిపతియయ్యెనని చెప్పుదురు.మరియొక గాథననుసరించి ఆదిత్యవర్మయను నింద్రప్రస్థపురరాజు తన రెండవకుమారుడు దేశమునుండి వెడలగొట్టెననియు, నా రాజపుత్రు డోడపై కాంభోజప్రాంతమునుజేరి, యచటి రాజునోడించి, దానె రాజయ్యెననియు, నొకసారి సముద్రతీరమున విసారించుచు నొక నాగకన్యను గాంచి మోహితుడై, యామెనుబరిణయ మాడెననియు, నంతట నాతనిమామగారగు నాగరాజు సముద్రములో గొంత నీటిని ద్రాగి, బయల్వెడలిన భూమికి తన యల్లునిరాజును జేసి, దానికి కాంభోజ యను నామము నిడెననియు, దెలియుచున్నది. ఇట్టి నాగరాజులతోడి వైవాహిక సంబంధమువలన రాజ్యాధికారమును బడయుట దక్షిణహిందూదేశములోని పల్లవ రాజవంశ చరిత్రమునను గలదు. చంపారాజ్యోత్పత్తిని పేర్కొనునపుడు కౌండిన్యుడను బ్రాహ్మణు డీప్రాంతమును క్రీ. శ. 1 వ శతాబ్దిలో జయించెనని చెప్పియుంటిమి. చైనాదేశీ