పుట:Bharatiyanagarik018597mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిన్‌గడిన్ (Bing-Dinh) కు సరిపోవును. ఇందేశ్రీవిజయ అను రేవుపట్టణ ముండెడిది. మూడవది దక్షిణముననుండెడి పాండురంగవిషయము. ఇదియే నేటి పన్‌రన్ (Panran) అను విభాగము. ఈవిషయములలో నొక్కొక్క దానిపై నొక్కొక రాజప్రతినిధి యుండెను. కేంద్రప్రభుత్వము యిర్వురు సామాన్యోద్యోగులయొక్కయు, నిర్వురు, ఘనోద్యోగుల యొక్కయు, మంత్రుల యొక్కయు, సాహాయ్యముతో రాజుచే నిర్వహింపబడుచుండెడిది. చంపారాజ్యము ప్రబలముగనుండినది. ఇందు గజాశ్వపదాతి బలములుండెడివి. ఖడ్గములు, బల్లెములు, డాలులును యుద్ధములలో నుపయోగింప బడుచుండెడివి. నగరములచుట్టును దిట్టములగు గోడలుండెడివి.


______________