పుట:Bharatiyanagarik018597mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీ. శ. 1 వ శతాబ్దినుండి 13 వ శతాబ్దివరకునుండిన యీహిందూరాజ్యపు నాగరికత నించుక పరిశీలింపవలసియున్నది. హిందూదేశమునందువలె చంపారాజ్యమునగూడ దేవాలయములు ముఖ్యనిర్మాణములుగ నుండినవి. వానిని సాధారణముగ నిటుకలతోను, అరుదుగ రాతితోను నిర్మించుచుండిరి. వీనిలోపలిభాగము దారునిర్మితము. ఒక యాల యాంతర్భాగము మంచిగందపుకఱ్ఱతో గట్టబడి, బంగారు వెండిరేకులమలామాను గలిగియుండెను. మరియొక దాని గోపురమునకు వెండిరేకువేయబడినది. ఈ యాచారము హిందూదేశమునగూడ నుండెడిది. చంపారాజ్యమున శైవ మతము ప్రబలముగ నుండినది. శర్వ, భవ, ఈశాన, పశుపతి, ఉగ్ర, రుద్ర యనుపేరులుగల్గి, నటరాజ, యోగి, లింగరూపములలో శివు డీదేశమున నారాధింపబడుచుండెను. చంపాశైవమతమున రెండు క్రొత్త విషయములు గలవు. అందు మొదటిది ముఖలింగపూజ. రాజులనేకులు తమ పేరిట బ్రతిష్ఠింపుచుండిరి. ఇందు సామాన్యమగు లింగమునకు పైభాగమున ముఖమొకటి కల్పింపబడుచుండెడిది. ఇట్టి ముఖలింగములను నిర్మించుటలో ఆయారాజులను శివునితో సరిచేయుటయే ముఖ్యోద్దేశమై యుండవచ్చును. శైవముతోపాటు శాక్తమును వ్యాపించినది. ఉమా, గౌరీ, చండీ, కాళి, భగవతీ యను పేరిట జనులా కాలమున శక్తినారాధించుచుండిరి. నంది, విఘ్నేశ్వరుడు నీశైవాలయములలో సామాన్యముగ స్థాపింపబడెడివి. చంపాశైవమున రెండవయంశము శంకర నారాయణపూజ. శివకేశవుల యభెదమును దెల్పుటకై యొక పార్శమున శివుని, మరియొక పార్శ్వమున విష్ణువును జూపు విగ్రహములు నిర్మింపబడినవి. శివునకుబిమ్మట విష్ణువు విశేషముగ నీరాజ్యమునం దారాదింప బడుచుండెను. ఇతనితోపాటు లక్ష్మియు, గరుడును పూజింపబడుచుండిరి. క్రీ. శ. 7 వ శతాబ్దినుండి యీదేశమున బౌద్దమతమును ప్రబలినది. ఇచట ననేకములగు విహరములు నిర్మింపబడినవి. నాగారోహకుడగు బుద్దుడు నవలోకితేశ్వరుడు నిట బూజింపబడిరి. కాని చంపాలోని బౌద్దశిల్పములు