పుట:Bharatiyanagarik018597mbp.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పీఠిక

భారతదేశ చరిత్ర పరిశోధకుల కిటీవల లభించిన చారిత్రకసామగ్రి యమూల్యమైనది. దానినుండి ప్రాచీనభారతీయుల గౌరవాధిక్యతలను సూచించు రెండు నూతనాంశములు బయల్వెడలినవి. అందు మొదటిది సింధుప్రాంత నాగరీకత. రెండవది దేశాంతరములయందలి భారతీయ నాగరీకత. ఈ రెండంశములునుగూడ ప్రపంచమంతటను విద్వల్లోకము యొక్క దృష్టి నాకర్షించినవి. ఈయంశములనుగూర్చి పలువురు పండితులు జేయుచున్న పరిశోధనల మూలమునను, వారికి తట్టుకున్న సిద్ధంతముల మూలమున నీ నూతనాంశముల ప్రాముఖ్యము దినదినము నభివృద్ధి నందుచున్నది.

సింధుప్రాంత నాగరీకత వలన భారతదేశ నాగరీకత యొక్క ప్రాచినత యినుమడించి, యంతర్జాతీయ చరిత్రమున భారతదేశమునకు గల గౌరవము హెచ్చినది. ఇతర దేశములలో దొరకిన భారతీయ నాగరికతా చిహ్నముల మూలమున భారతదేశ చరిత్ర పరిణామమునం దజ్ఞాతపుర్వమగు నొక నూతనపథము బయల్వెడలినది. అందునను భారతీయ నాగరికతా విస్తరణ చరిత్రము నేటి సంక్షుభిత సమయమున భారతీయులకు నూతనోత్సాహము నొసంగదగియున్నది. నేను పాశ్చాత్యదేశీయులు నాగరికతా ప్రచారకులమనియు, పెక్కు వలసరాజ్యములతో సామ్రాజ్యముల కధినేతలమనియు సగర్వముగ విజృంభించుచున్నారు. ప్రపంచమునం