పుట:Bharatiyanagarik018597mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములలో నాకాలమున కౌండిన్యుడను హిందూబ్రాహ్మణుడు ఇండోచైనాలోని 'ఫోనన్‌' (Faunan) దేశమునకేగి, యచ్చట రాణిని వశపరచుకొని పెండ్లియాడెనని యున్నది. అంతటినుండియునీ ప్రదేశమొక హిందూరాజ్యమయ్యెను. చైనాదేశ చరిత్రకారు లీవిషయము క్రీ. శ. 1 వ శతాబ్దములో జరిగెనని వ్రాసియున్నారు. ఈ కాలమున హిందూదేశమునందలి భరుకచ్చమను రేవుపట్టణమునుండి చైనాలోని 'టాన్‌కిన్‌' నగరమునకు సముద్రమార్గమున వర్తకము జరుగుచుండెడిది. 2 వ శతాబ్దిలో ఇప్పటి అవ్నాం దేశమున 'చంపా' యను మరియొక హిందూరాజ్యము స్థాపింపబడినది. మరుసటిశదాబ్దిలో భారత దేశమునందలి మురుండ రాజునకును చైనాకును రాయబారములు జరగినవి. 5 వ శతాబ్దిలో ఫాహియన్ హిందూదేశమునకు వచ్చినప్పటికి తామ్రలిప్తీనగరము గొప్ప నౌకావాణిజ్యకేంద్రముగ నుండి చైనాతో వర్తకము జరుపుచుండెను. ఇచటినుండి గుణవర్మ, పరమార్దుడు, మున్నగువారెందరో మతప్రచారమునకై హిందూచైనాదేశములకు తరచు ప్రయాణము జేయుచుండిరి.

నాగరికతా విస్తారకులు

ఇంతవరకును భారతదేశమునకును చైనాకును ప్రాచీనకాలమున సన్నిహిత సంబంధముండెడిదనియు, నీదేశములమధ్య ననేక మార్గములుండెడివనియు నిరూపించియుంటిమి. అనేక సమయములలో ననేక జాతుల వారలు భారతీయ నాగరికతను చైనాదేశమున విస్తరింపజేసిరి. ఇటుపైనీనాగరికతా ప్రచారముయొక్క చరిత్రము వివరింపబడును.

మధ్యఆసియా జాతులు :- (1) ఇండోసిథియనులు - చైనాదేశీయులు హూణుల బాధపడజాలక దమకు బశ్చిమమునుండి యీశత్రువులను ద్రొక్కిపెట్టగల యొక రాజ్యముతో స్నేహము జేసికొనుటకై యత్నించిరి. ఈ సిథియనుల రాజ్య మట్టిది. క్రీ. శ. 1 వ శదాబ్దిలో నీరెండురాజ్యముల