పుట:Bharatiyanagarik018597mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

618 లో చైనాదేశమున గల్పింపబడిన యొకబాట 638 నాటికి అస్సాంకు వ్యాపించెననియు, నాదేశమునుండి దక్షిణచైనాకు రెండునెలలలో గొనిపోవు మార్గమొకటిగలదనియు వినెను. కియటన్ అను 8 వ శతాబ్దపు చైనాగ్రంథమునుండి యీ మార్గమునుగూర్చి కొన్నివివరములు తెలియుచున్నవి. అయ్యది చైనాకు దక్షిణమునందున్న టాన్‌కిన్‌నుండి బయలుదేరి యూనన్ చేరి, యటనుండి పశ్చిమముగనేగి, సలోఎస్ నదిని దాటి చౌకొలీన్‌గ్‌కు పోవుచుండెను. అది యొక ముఖ్యస్థానము. ఇటనుండి యీదారి రెండు శాఖలయ్యెను. ఒకశాఖ యిచ్చటనుండి బర్మాలోని మాండిలేకేగి, పేగన్ ప్రోంలమీదుగా అరకన్ పర్వతములనుదాటి అస్సాము బ్రవేశించుచుండెను. రెండవశాఖ దక్షణముగా ఐరావతీముఖ ద్వారమువరకునేగి పిమ్మట అస్సాముకు బోవుచుండెను.

(3) టిబెట్ మార్గము ;- క్రీ. శ. 7 వ శతాబ్దములో ఇండియానుండి చైనాకు మరియొకమార్గము నిర్మింపబడెను. అప్పటి టిబెట్‌రాజగు స్ట్రాంగ్‌ట్సన్ గంపో యనునతడు చైనారాజపుత్రికను బెండ్లియాడుటచే హిందూ చైనాదేశములకు దరచు రాకపోకలు జరుగుచుండెడివి. క్రీ. శ. 627 లో ప్రభాకరమిత్రుడను నాలందావిధ్యాపీఠ పండితుడు టిబెట్‌మార్గమున చైనా కేగి యచ్చట బౌద్దమతమును వ్యాపింపజేసెను. అదేసంవత్సరమున హ్యూన్‌ఖౌ అను చైనాశ్రమణుడొక డీమార్గముననే భారతదేశమునకు వచ్చెను. చక్రవర్తి శ్రీహర్షుని రాజ్యకాలమునం దీదేశమునకేతెంచిన హ్యూన్‌ష్వాంగ్‌కూడ నీమార్గమునే యనుసరించెను. ఆచక్రవర్తి యనంతర మిదేమార్గమున వచ్చి టిబెట్ నేపాళదేశముల సేనలు హిందూదేశమున విజయములను గాంచినవి. కాని 650 లో 'గంపో, చనిపోయినపిమ్మట టిబెట్ చైనాదేశములకు నిరంతరశాత్రవ మేర్పడుటచే నీమార్గము కట్టువెడెను.

(4) సముద్రమార్గము :- క్రీ. శ. మొదటిశతాబ్దమునుండియు చైనా హిందూదేశములకు రాకపోకలు జరుగుచుండెడివి. చైనాదేశీయుల గ్రంథ