పుట:Bharatiyanagarik018597mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) ఉదనవగ్గము :- ఈగ్రంథముయొక్క భాగములు వివిధ స్థలములలో దొరికినవి. చెట్లబెరడుతో తయారుచేసిన పుటలపై మసితో వెడల్పగు కలముతో నీగ్రంథము లిఖింపబడినది. లిపినిబట్టి యియ్యది క్రీ. శ. 2 వ శతాబ్దమునాటిదిగ గన్పట్టుచున్నది. ఇయ్యది బౌద్దులలో సర్వాస్తివాదులకు ముఖ్యగ్రంథము. ముప్పదిమూడు ప్రకరణములుగల యీ గ్రంథములో 1000 శ్లోకములుగలవు. ధర్మత్రాతయను నత డీగ్రంథమును రచించెను, ప్రకరణ పదమను గ్రంథమును రచించి, కనిష్కునిచే గావింపబడిన బౌద్దసంఘ సమావేశమున కధ్యక్షుడుగ నుండిన వసుమిత్రుని కీతడు మేనమామ. ఉదనవగ్గము మిగుల ముఖ్యమగు గ్రంథమగుటచే దానిపై నెన్నియో వ్యాఖ్యానములును భాషాంతరీకరణములును బయల్వెడలినవి.

(3) కల్పనామండితిక :- కుమారలాతుడు దీనిని రచించెను. ఇయ్యది దుబ్బుకలముతో తాళపత్రములపై లిఖింపబడినది. ఇయ్యది క్రీ. శ. 300 ప్రాంతమున పశ్చిమోత్తర భారత దేశ మున నిర్మింపబడి పిమ్మట మధ్యఆసియాకు గొనిపోబడెనని పండితుల యభిప్రాయము.

(4) బవర్‌గ్రంథము :- దీనిలో ఏడు చిన్న చిన్న గ్రంథములున్నవి. ఇందు మూడు వైద్యశాస్త్రమునకు సంబంధించినవి. వీనిలో నుల్లిపాయవలన నెన్నియోరోగములు కుదురుననియు, పూర్ణాయుర్దాయము గల్గుననియు వ్రాయబడియున్నది. జీర్ణపద్దతి, మూలికలు, కషాయములు, అంజనములు మున్నగువాని ప్రశంస యిందు గలదు. మఱియొక ఖండములో 14 వైద్యయోగములు గలవు. ఈగ్రంథభాగములలో ముఖ్యమైనది "నవనీతకము". అగ్నివేష, భేద, హారీత, జాతుకర్ణ, క్షారపాణి, పరాశరాది వైద్యశాస్త్రజ్ఞుల గ్రంథములందలి సారాంశ మీనవనీతకమున గలదు. భస్మ,