పుట:Bharatiyanagarik018597mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫలకము లుద్యోగుల కొసగబడు నాజ్ఞలనుదెల్పునవిగ నున్నవి. మఱిగొన్ని బ్రజలు దమలోదాము జేసికొనిన యొడంబడికలను దెల్పుచున్నవి. వీనిలో సంవత్సరము లీయబడినవి.

(3) చర్మలేఖలు :- మధ్యఆసియాలో నీకాలమున చర్మములుగూడ వ్రాయుటకై యుబయోగింపబడు చుండెడివి. ఈసందర్భమునం దుపయోగింపబడిన కఱ్ఱకలములును సిరాపాత్రములు నెన్నియో గనుగొన బడినవి. ఈచర్మలేఖలలో రెండుతరగతు లున్నవి. కొన్ని యున్నతోద్యోగుల సామాంతులకు వ్రాసినవి. రెండవ తరగతివానికి "వింసదిలేఖ" లని పేరు. అయ్యవి సాధారణముగ రాజుచే వ్రాయబడినవి. వీనిలో సంవత్సరములు గాక మాసములును రోజులును ఉదహరింపబడి యున్నవి.

(4) కాగితపు టుత్తరములు :- ఇవి కొలదిగ మాత్రము లభించినవి. ఇందలిభాష ప్రాకృతము. లిపి ఖరోష్ఠి

(5) పట్టువస్త్రములపై లేఖలు :- క్రీ. శ. 105 నుండియు చైనాలో పట్టుగుడ్డలను వ్రాయుటకై యుపయోగించుచుండిరి. లేఖలు ప్రాకృతభాషలో ఖరోష్ఠిలిపిలోనున్నవి. ఇందు చాలవరకును సాధారణలేఖలు. కొన్నిదేవాలయములపై నుండెడి జండాలు. ఒకలేఖలో నొకడు తనయాప్తుని యారోగ్యమునకై గావించిన ప్రార్థనగలదు. ఇందు "అరుఘ దచిన ఏభవదు" (ఆరోగ్యదక్షిణాయై భవతు) అని వ్రాయబడియున్నది. ఇట్టివాక్యము హిందూదేశములోని కుషాన్‌రాజుల శాసనములలోగూడ గలదు.

ఇటుపై నచ్చటనే దొరకిన బ్రాహ్మీలిఖితవస్తువులను వర్ణింపవలసి యున్నది. బ్రాహ్మీలిపి భారతదేశమునం దెక్కుడు వ్యాప్తినిజెంది యాధునిక లిపుల కెన్నిటికో మాతృకగ నున్నది. భారతీయనాగరికతతోబాటుగ నీ లిపిగూడ విదేశములకేగినది. దీనిలో వ్రాయబడిన గ్రంథములెన్నియో మధ్య