పుట:Bharatiyanagarik018597mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్య ఆసియాయందలి భారతీయనాగరికతా చరిత్రమును రచించుటకు దగిన యాధారము లింకను లభింపవలసియున్నవి. అయినను పరిశోదకుల కీప్రదేశమున దొరకిన వివిధవస్తువులనుండి యీప్రదేశములపై హిందూదేశము దన ప్రభావమును జూపినవిదమునుగూర్చి కొన్ని విశేషాంతములు దెలియుచున్నవి. కాన నీవస్తువులను క్లుప్తముగా వర్ణింపవలసియున్నది.

(1) ప్రాకృతధర్మపదము :- ఇయ్యది బెరడును లేఖ నాయోగ్యముగ నొనర్చి దానిపై వ్రాసిన గ్రంథము. దీనిని క్రీ. శ. 1892 లో నిప్పటి కోటానుకు సమీపమునందున్న గోశృంగవిహారమను గుహలో నొక ఫ్రెంచి దేశీయుడు గనుగొనెను. క్రీ. శ. 3, 4 శతాబ్దములవరకును బశ్చిమోత్తర భారతదేశమున వ్యాప్తిలోనుండిన ఖరోష్ఠిలిపిలో నీగ్రంథము వ్రాయబడియున్నది. అక్షరవిన్యాసమునుబట్టి పండితు లీగ్రంథము క్రీ. శ. 2 వ శతాబ్దినాటిదని నిర్ణయించినారు. ఇందలి ప్రాకృతభాష నూతనము. ఇంతవరకును పరిశోధకులకు పాళిసంస్కృతభాషలలో మాత్రమే ధమ్మ పదము లభించియున్నది.

(2) ఖరోష్ఠీ ఫలకములు :- మధ్యఆసియాలోని శిదిలములలో నెన్నియోదారుఫలకములు దొరికినవి. వీనిలో కొన్ని వలయాకారములు, మఱికొన్ని చతురస్రములు. ఇందుమొదటివానికి 'కీలముద్ర' లనిపేరు. 7 మొదలు 15 అంగుళములవరకును పొడవుగల రెండుపలకములు ఒకధారముచే కట్టబడి, పైఫలకమునం దొక మట్టిముద్ర వేయబడియున్నది. ఇందు "మహానుభావ, మహారాజ" యని పిలువబడు రాజు, కొన్ని వ్యవహారములను బరిష్కరించునెడ స్థానికోద్యోగుల కిచ్చిన యాజ్ఞలు లిఖింపబడినవి. పరిపాలనావత్సరమును, ఆజ్ఞను నిర్వహింపవలసిన యుద్యోగి నామమునుగూడ నిందుగలవు. చతురస్రములగు ఫలకములు సుమా రొక గజమువరకునుగూడ నిడివిగలవై యున్నవి. వీటికిని మృణ్ముద్రగలదు. ఇందొక తరగతి