పుట:Bharatiyanagarik018597mbp.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ములును, పరిశోధక పత్రికలలోని పెక్కుపండితుల వ్యాసములును ప్రాగ్భారతదేశముల అర్షశాఖానివేదికలు నీగ్రంథరచనమున నాకు మిక్కిలి తోడ్పడినవి.

నావ్యాసములను తమ పత్రికలలో బ్రకటించిన దత్తత్పత్రికాధిపతులకు నేను కృతజ్ఞుడను. ఈగ్రంథమునకు ముద్రణాభాగ్యము గలుగజేసిన వేంకటరామ అండ్ కో. యజమానులగు మ. ర. శ్రీ. ఈదర వెంకటరావుపంతులుగారికి నా వందనములు.

ఈ గ్రంథ మాంధ్రలోకముయొక్క యాదరమును బడయుగాక.


గ్రంథకర్త.

గుంటూరు

14-6-47