పుట:Bharatiyanagarik018597mbp.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నుండిరని తృణీకారభావము జూపబడినది. అపస్తంభ, బౌథాయనులు, గాంధారపారసీకదేశములకు పోకూడదని శాసింసిరి.

పర్షియను విజయము = క్రీ. పూ. 522-486 నడుమ పర్షియా నేలిన డరయస్ అను రాజు బ్యాక్ట్రియా, గాంథార, సింధుమైదానములను తన రాజ్యమున చేర్చికొనెను. గాంధారదేశమునకును భారతదేశమునకు ననేకవిదములగు సంబంద ముండెడిది. భారతదేశమునందలి పదునారు మహా జనపదములలో గాంధార మొక్కటిగ పేర్కొనబడియున్నది. సంస్కృత వ్యాకరణ నిర్మాతయగు పాణిని యాదేశముననే జన్మించెను. బౌద్దజాతకములలోని రంగము లనేకము లచ్చటివే. ఇదిగాక హిందూదేశపు సరిహద్దులో తటగు, అపరిటై, శక, పర్షియను సామ్రాజ్య విభాగము లుండెడివి. వీనిలో తటగుదేశవాసులగు దర్దెస్ అనువారు మహాభారతమునందు నితర సంస్కృతగ్రంథములందును దరదులని పేర్కొనబడియున్నవారు, శక యను ప్రదేశమున కాస్టిడిం అను జాతి యుండెడిది. పాణని కౌటిల్యుడు, మున్నగువారు వీరిని కాపిశులని పేర్కొనియున్నారు.

అలెగ్జాండరు విజయము :- ఈయవనవిజేత భారత దేశముపై దండెత్తివచ్చిన సమయమునం దఫ్‌గనిస్థానముపై హిందూదేశ ప్రభావము ప్రబలముగనుండినది. ఆకాలమున హిందూకుష్ పర్వత ప్రాంతమును శశిగుప్తుడను నత డేలుచుండెను. అపెసినియ్, అస్సికులు నను తెగలవారు బ్రకృతకునార్, పాన్‌జ్‌కోరా, స్వాత్‌నదితీరములం దుండిన భారత జాతీయులు. ఇచ్చట ననేకస్థలములకును నదులకును హిందూనామము లుండెడివి. సువాస్తు, గౌరీనదులును పుష్కరావతీ నగరము నిందు కుదాహరణములు. మహాభారతమునం దొకచో (5-9-333) నదీవర్ణనమునం దీనదులుగూడ పేర్కొనబడియున్నవి.