పుట:Bharatiyanagarik018597mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లక్షణము మున్నగుభారతీయ గ్రంథములెన్నియో భాషాంతరీకరింపబడినవి. మొత్తముమీద టిబెటనులు తాంత్రికబౌద్దమున బద్ధాదరులైరి. మంత్రములు, ఇంద్రజాలము, శక్త్యారాధనము వీరికి ప్రీతికరములు.

(2) చైనా :- క్రీ. పూ. 3 వ శతాబ్దమున చైనాదేశీయులు హిందూదేశమును జేరుటకై యనేకప్రయత్నము లొనర్చిరి. క్రీ. పూ. 217లో పదునెన్మండ్రు బౌద్దబిక్షవు లాదేశమునకేగిరట. మఱుసటి శతాబ్దమున 'చాంగ్‌కియన్‌' అను నతడటనుండి మొదటిసారి మనదేశమునకు రాగల్గెను. క్రీస్తుశకారంభమున యూఎచి, బాక్ట్రియను, సాగ్ఱయసుమున్నగు మద్య ఆసియాజాతులవారు చైనాలోబౌద్దమతము నుపదేశించిరి. క్రీ. శ. 67లో కశ్యపమతంగుడు, ధర్మరక్షకుడునను నిర్వురు భారతీయభిక్షవులు చైనాకేగి 'మింగ్‌టి' యను నాదేశపు చక్రవర్తియాదరణ నంది బౌద్దగ్రంథములను భాషాంతరీకరించియు, నారాధనలను నెలకొల్పియు, మతప్రచారము సాగించిరి. క్రీ. శ. 4 వ శతాబ్దమున 'పాహియన్‌' అను నత డనేకకష్టముల కోర్చి యీదేశమున కేతెంచెను. ఈతడు తక్షశిలా, పురుషపురము, పాటలీపుత్రము, తామ్రలిప్తి మున్నగు బౌద్ద విద్యాస్థానములలో బౌద్దమతరహస్యములను నేర్చుకొనెను. ఇందుచే చైనాదేశీయులకు బౌద్దగ్రంథములను, మతమునుగూడ, సూత్రతల నుండి నేర్పుటకవకాశము గలిగెను.

ఇదేసమయమునం దొక చైనాదేశసైన్యాధిపతి "కుమారవిజయుడను నొకభారతీయుని దనదేశమునకుబందిగగొనిపోయెను. ఈతడు పదిసంవత్సరము లాదేశముననుండి, యసమాన పాండితీప్రతిభచే ననేకమేధావంతుల నాకర్షించి, బౌద్దగ్రంథ భాషాంతరీకరణమునకు మార్గదశ్సియయ్యెను. ఈకాలమున బుద్దభద్రుడను మఱియొక భిక్షవు సముద్రమార్గమున చైనాదేశముజేరి దక్షిణభాగమున మత ప్రచారమారంభించెను.