పుట:Bharatiyanagarik018597mbp.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గొంతవరకును ద్రవిడదేశ సంపర్కమును గన్పించుచున్నది. ఈ భారతీయ నాగరికత భూమార్గమునను సముద్రమార్గముననుగూడ విస్తరించెను. సామాన్యవాణిజ్యమార్గములే నాగరికతా విస్తరణమునకుగూడ మార్గములైనవి. ఇటుపైనీ విస్తరణము సవిస్తరముగ వివరింపబడును.

(1) టిబెట్:- క్రీ. శ. 1 వ శతాబ్దమున 'యూఎచీ' అను నొకజాతివారు మధ్య ఆసియానుండి భారతభూమిపై దండెత్తివచ్చి యిట స్థిరపడిరి. వారిలో నొక తెగవారగు కుపాను లిచ్చట రాజ్యమేలిరి. అందు సుప్రసిద్దుడును, భారతీయచక్రవర్తులలో నగ్రగణ్యుడునగు కనిష్కుడు కాష్‌ఘర్, యార్‌ఖండ్ మున్నగు మద్య ఆసియాలోని ప్రదేశములను జయించెను. ఈతని యాదరణముచే నీదేశములలో మహాయానబౌద్దమతము విస్తరించినది. ఇటనుండి యీమతము చైనాకు ప్రాకినది. క్రీ. శ. 7 వ శతాబ్దమున స్ట్రాంగ్ ట్సన్ గంపో (Strang-tsan-Gampo)యను నాతడు టిబెట్టును పాలించుచుండెను. అతని భార్యయగు నేపాలరాజపుత్రిక తాంత్రికబౌద్దమతము నాదేశమున బ్రవేశింపజేసెను. అ రాజు మఱియొకభార్యయగు చైనారాజపుత్రిక యాదరమున టిబెట్టుదేశమున కనేకులగు చైనాదేశభిక్షవు లేతెంచిరి. గంపోరాజు తనమంత్రిని హిందూదేశమునకు విశేషజ్ఞానము నుపార్జించుటకై బంప, నాతడు దేవనాగరీలిపినుండి యొకక్రొత్తలిపిని నిర్మించి టిబెట్టుదేశమున బ్రచారము చేయించెను. క్రీ. శ. 8 వ శతాబ్దమున మఱియొకరాజు పద్మసంభవుడు నాతనిశిష్యుడగు వైరోచనుడు మున్నగు భారతీయపండితుల ననేకులరావించి వారిసాహాయ్యమున టిబెటనుభాషలో వాఙ్మయమును నిర్మింపజేసెను. క్రీ. శ. 1083 లోనాలందావిశ్వవిద్యాలయాధ్యక్షుడును బండితశిఖామణియునగు ద్వీపాంకర అతీశుడు టిబెట్టునకేగి యచ్చటిమతమునకు నూతనోత్తేజమును గల్గించెను. ఆదేశమునం దమరకోశము, మేఘదూతము, చంద్రగోమివ్యాకరణము, చిత్ర