పుట:Bharatiyanagarik018597mbp.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భారతీయ నాగరికతా విస్తరణము.

2. నాగరికతా విస్తృతి.

పూర్వప్రకరణమున ప్రాచీనభారతీయుల యాదర్శములను పేర్కొనియుంటిమి. ఈప్రకరణమునందు భారతీయనాగరికత యేయేదేశములయం దేయేశతాబ్దములలో వ్యాపించెనో దిజ్మాత్రముగ సూచింపబడును.

ఇటీవల పికాడర్స్‌పెట్రీ యను నొక పండితుడు యీరప్, ఆసియా, ఆప్రీకా ఖండముల నడుమగల మద్యధరాసముద్ర తీరమునందున్న మెంఫియనునగరమున భారతీయ స్త్రీపురుషుల చిత్రములను గనుగొనెను. ప్రాచీనభారతీయు లాసియాఖండపు ప్రాగుత్తరముననున్న జపాను ద్వీపమునందును, ప్రాగ్దక్షణముననున్న మొలక్కాసుద్వీపమునను, నైరుతిభాగమునందున్న ఆఫ్రికాఖండమునకు సమీపమునందున్న మెడగాస్కర్‌ద్వీపముననుగూడ తమ నాగరికతను వ్యాపింపజేసినటుల తెలియనగుచున్నది. ఈ యెల్లలనడుమనుండు సువిశాలభూభాగమంతయు నొకప్పుడు భారతీయాధ్యాత్మిక సామ్రాజ్యముగ నుండెను.

ఈయార్యనాగరికత భారతదేశమునందలి యన్నిభాగములనుండియు విస్తరించెను. పశ్చిమమున ఆప్‌గనిస్థానముమొదలు తూర్పున జపానువరకునుగల దేశములలో వ్యాపించిన నాగరికత యుత్తరాపన నాగరికత. బర్మా, ఇండోచైనా, జావా, సుమత్రాలలో విస్తరించినది. యాంధ్రదేశ నాగరికత. ఆశియాఖండపు ప్రాగ్దక్షిణద్వీపములలో