పుట:Bharatiyanagarik018597mbp.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మార్పుజేసికొని, క్రమక్రమముగ పైజాతులవారినెల్ల వశపరచుకొనిరి. ఈయార్యానార్య నాగరికతా సమ్మిశ్రవణమువలన నీరెండుజాతులవారికిని లక్ష్యైక్యతయు, దన్మూలమున శాంతియు సమకూడినవి. దానినుండి జాతినిర్మూలనముగాక జాత్యుద్దరణిమే ప్రాచీనభారతీయుల మొదటి యాదర్శమని స్పష్టమగుచున్నది.

పూర్వభారతీయుల యాద్యాత్మిక ప్రవృత్తిగూడ విశ్వాత్మకముగనే యుండినది. ఉపనిషత్తులు సంసారచక్రమున పరిభ్రమించు మానవకోటి కంతటికినిగూడ మోక్షమార్గము నుపదేశించుచున్నవి. అదే విధమున బౌద్దతత్వముగూడ సర్వమానవ కల్యాణము చేకూరు మార్గముల నెన్నిటినో యుపదేశించినది. ఈవిదమున ప్రాచీనభారతదేశము అహింస, తృష్ణారాహిత్యత, సాహార్దతయను సూత్రముల నుపపాదించి ప్రతివ్యక్తికిని శాశ్వతసుఖము నొనగూర్పదగియుండెను. దానినుండి ప్రాచీనభారతీయులు సర్వసంతరణమును మరియొక యాదర్శముగ నుంచుకొనిరని స్పష్టమగుచున్నది.

క్రీ. పూ. 5-3 శతాబ్దములలో విశ్వసామ్రాజ్య నిర్మాణకాంక్షచే రాజన్యులెందరో దుష్కృత్యముల ననేకముల జేసియుండిరి. స్వార్దపరులై కేవల పశుబలముతో పర్షియనులు నటుపిమ్మట యవనవీరుడగు నలెగ్జాండరును సువిశాలములగు సామ్రాజ్యములను నిర్మింప యత్నించి, నాటి మనుష్యకోటి నెన్నియోవిధముల పీడించిరి. కాని మానవ రుధిరార్దృములగు యుద్ధభూములలో హృదయదారకమగు నిర్వేదము నణంచి భారతభూమి యిదేసమయమున మరియొకసారి శాంతిసందేశము సుద్ఘోషించెను. కళింగ సంగరరంగమున "దర్మమను మహాస్త్రముచే మానవ హృదయములను జయించుటయే నిజమైన విజయము" అను సవిమర్శకమగు ప్రబోదమునంది యశ:కాయుడగు నశోకచక్రవర్తి "సర్వేమనుష్యామే ప్రజా:" అని యుద్ఘోపించి, జాతిమత వివక్షతలను పాటింపక