పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 5]

53

భారత రమణి

హరి--ఔనౌను. శీఘ్రం ఏమి నవీనా?

నవీ--ప్రభువుగారిమాట తప్పు;నా?

శంక--దేవేంద్రా, ఏమాలీచించుచున్నావు?

దేవే--ఏమియు లేదు. ఇంట్లో నేదో రోదనధ్వని యగుచున్నట్లున్నది. మీకు వినబడలేదా?

ఉపే--ఏమియూ లేదు, కానిండు

హరి--దేవేంద్రా! ఇట్టి వరుడు లభించుటకు మీకన్య అఖండతపస్సు చేసి యుండవలయును.

శంక--కుబేర సంపత్తి!

నవీ--ఓహో!

వినో--వయసు నెంచవు

హరి--దానికేమి? జుట్టుకు నల్లరంగు పూసినచో ఇరువదేండ్ల పెళ్లికుమారుని లాగుండును.

సదా--దంతములు కూడా కట్టించుకొనవలయు నేమో?

శంక--దేవేంద్రా, ఎందుకీ ఆలస్యము?

దేవే--లేదు లేదు. ఏమి సదానందా, సంకల్ప మారంబింతునా?

సదా--నీ చిత్తము.

దేవే--అట్లు కాదు మనస్పూర్తిగా ఈ పని చేయుమని నీవు చెప్పువరకు నేను చేయజాలను. నీవు చెప్పిన వెంటనే చేసెదను.

ఉపే-- నెను చెప్పచుంటనే?