పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

51

భారత రమణి

చెప్పుము నా కొర కేమియు ప్రయత్నము చేయవద్దు. సుశీల ఏది?

మహే-- కనబడ లేదు

కేదా--దాని కీపెళ్ళి యిష్టముకాదు గదా?

మహె-- అదేమో?

కేదా-- దాని కిష్టమైన నేమి?

(సుశీల వచ్చును)

నీకు పెండ్లియట? (ఆమె ఊరకుండును) సరే, ఈ పెళ్ళి కాజాలదు. నేను కానీయను. నీకిది ఇష్టములేదుకదా? (ఆమె ఊరకుండును) తెలిసినది. మహెంద్రా! ఈ పెళ్ళి కాదు. సుశీలా, మీ నాన్నతో 'నాకు కూటికి గుడ్దకూ మీ రీయలేనిచో కేదారుడునన్ను పోషించుననుము. నా కాడపిల్లలు లేరు. నీవే నా కూతురవు. మా యింటికి రా! (సుశీల ఏడ్చును) ఏడువకు. ఈ పెళ్లికానీయను. నేను కానీయను. మహేంద్రా)! కాగితముజ్ కలమును తీసుకొనిరా! (పోవును, నవ్వి)దేవేంద్రా)! బోధపడినది. అంతయు తెలిసినది. నీయవస్థను నాకిచ్చి నా యవస్థను నీవు కొనుము..ఇట్టియెడ నేను చేయవలయునో మన సంఘమునకు చక్కగా బోదింతురు. దిక్కుమాలిన మన సమాజము కసాయి దుకాణము. పిశాచి! రాక్షసి! (సుశీలతో) అమ్మా! క్షమించు నీయెడల తిట్టకూడదు. మన సంఘము చాలా