పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రం 2]

భారత రమణి

159


సరళము, స్థిరము, ఉదారము, అనఘము, అకృపణము, ఆనందమయము నగు శీల మెందును గాంచబోము.

(దేవేంద్రుడు సుశీల, వినయుడు, వినోదియును వత్తురు.

దేవే-- సదానందా, ఏరీ నీ శిష్యులు? నీవు రచించిన గీరమును మనపిల్లలకు వినిపింతము లోనికి రమ్మనుము...

(సదానందుడు వెళ్ళి వారితో వచ్చును)

(భక్త్గగణము పాడుదురు.)

పాట

చిరముజీవింపుము - భారతరమణీ -
   రమణీకుల ప్రపరా!
 దరహసితానన - సుధామయీ
    కోకిలకంఠమృదుమధురస్వరా ॥చి॥
లలితగుణగణా - లజ్జాభరణా-
   నిఖిల భువనవిజయీనయనా|
మలయపవన గమనా - విషయాంచిత-
   స్నేహప్రీతి శమదమముఖరా
ముక్తాదశనా - సత్కగురుజనా-
   రక్తకమలదళ కోమల అథరా ॥చి॥
ధరసమసహనా - సరళసునచ-నా।
    స్వార్ధదాసునికి దాసిన్
బురదను శశికళ - పూడ్చిన పోలిక
   సరసిజగర్భుడు - నెరపెను నిన్నున్