Jump to content

పుట:Bhaktha Kuchela 1935-Song Booklet.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతట రాజుకుకోపమువచ్చి కుచేలుని రాజద్రోహిగా నేరమా కోపించి దేశభిష్ణునిగాజేయుట. శ్రీకృష్ణుడు తన భక్తుని విషయము దుఃఖాక్రాంతుడగుట, మైమరచి శ్రీకృష్ణుడు మురళికిబదులు ఈలపాట పాడుట రాఘవుడు రోగవిము కుడై శ్రీకృష్ణవిగ్రహమును పాలుతాగమనికోరుట. అంతట వి హమునుండి చిన్నకృష్ణుడు ప్రత్యక్షమై రాఘవుడిచ్చిన పాలను త్రాగి మాయమగుట అచ్చట ద్వారకలో శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడగు వుద్ధవునితో మాట్లాడుచు ధర్మరాజు జేయబోవు రాజసూయాగమునకు తానుచని దుర్మార్గుడగు శిశుపాలుని సంహరింప నిశ్చయించుట. కుచేలుడు రాజు గారి దేశ భ్రష్టయా చే తనయింటికి చని భార్యా పుత్రుల ప్రోత్సాహముచే అటుకులను తీసుకొని తన బాల్యమిత్రుడగు శ్రీకృష్ణునిదర్శనభిక్ష కై ద్వారకకు పోవుట. అంతట శ్రీకృష్ణుడు రధారూఢుడైన ధర్మరాజు దర్బారుకునుట. ధర్మరాజు శ్రీకృషుని గౌరవించుట - శిశుపాలుడు కూడనూ రధారూఢుడై రాజసూయాగి మునకు బయలు వెడలుట అదిచూచి శిశుపాలుడు సహిం - పక కృష్ణుని ఆగౌరవముజేయబూనుట శ్రీకృష్ణుడుతన సుదర్శనము చే శిశుపాలుని చంపుట - కుచేలుడు ద్వారకానగరమార్గమున బడలిక చే సొమ్మసిల్లి శ్రీకృష్ణుని తన హృదయమున ధ్యానించి మూర్ఛపోవుట_ అంతట శ్రీకృష్ణభగవానుడు ప్రత్యక్షమై తన భక్తాగ్రేసరుని కౌగలించు కొని యెత్తుకొని ఆకాశమార్గమున తీసుకొనిపోయి తనమాధుర్య ఈల పాటచే రంజింపజేసి ముద్దాడి ద్వారకా నగరః ప్ర్రాంతః సమీపమున విడిచి పెట్టి అంతర్ధానమగుట_ మరికొంత సేపటికి సొమ్మసిల్లిన కుచేలుడు తెలువొంది శ్రీకృష్ణుని కోటద్వారము సమీపించుట... ము క్తిదాయకమగు తరువాయి కధను కని విని మోక్షమును పొందుడు !!! చిగటపుడు మూరి. భ క్తకుచేలలోని పాటలు, పద్యములు. ప్ర్రార్ధన :- శ్రీగోపాల బాల వే బ్రోవగ రాదా నిరతము మమ్మున్ I శ్రీ | కారద :- కరివరదా, వరసుగుణా మునిజనవందిత పదసు హృదయా ॥ శ్రీ ! కరుణనుబో నగ సమయ మిదే శ్రీలక్ష్మీ విలాస సంఘంబున్ మౌనివిలోలా, శ్రీలోలా ధీనులమున్, గానగ రా గోవిందా | శ్రీ || మోహన, గోపాలా ! పాహిమాం ॥ మో|| కరుణాలోలా, కాంచనచేలా ॥ మో !! లాలితలాలస, భ క్తజనాలయ, కమలానా ధా, ఖేలనలీల, యదుకులభూషణ, మదన, మోహన ॥ మో ॥ కుచే :- హ రేమురారే ! మధుకైటభారే గోవిందా, గోపాలముకుందా శౌరీ ॥ హ ॥