4 ఒక నాడు సాందీపముని పాఠశాలలో ఆటుకులను పంచి పెట్టుమని గురువుగారు కుచేలుని పిలిచి యిచ్చుట. కుచేలుడు కృష్ణునివాటా అపహ రింపగా కుచేలుని శ్రీకృష్ణుడు శపించుట. అంతర మధ్యమున చూచు చున్న నారదుని గానామృతము . మరునాడు కుచేలుడు కృష్ణ నిదర్శన ముకొరకు బాధపడుచు పశ్చాత్తాపముతో వెదకుట . చిన్నకుచేలుడు పెద్దకుచేలుడుగా మారుట. కృష్ణవిగ్రహమును కుచేలుడు ప్ర్రార్ధన చేయుచుండగా కృష్ణుడు కుచేలునికి తనమాధుర్యగాన ముతో దర్శనమిచ్చి అంతర్ధానమగుట. ద్వారకానగరమున శ్రీకృష్ణుడు అంతఃపురమున రుక్మిణి, సత్య భామల భ క్తిసంవాదన. నారదప్రోత్సాహము. కుచేలుని పరీక్షించు టకు సత్యభామ నారదుని పంపుట. కుచేలుని కుటీరమున అన్నపూర్ణ కుచే లభ క్తి ప్రసంశము . గోవిందనామ సంకీర్తన. కరకటశాస్త్రి కోన ముచే పురాణకాల క్షేప ఆటంకము . మరునాడు నారదుడు కుచేల కుటీరమునకువచ్చి భక్తివలదనియు, వుద్యోగము సంపాదించవలయునని ప్రోత్సాహించును. కుచెలుని తిరస్కారము. అంతరమధ్యమున త్రిమూర్తులు, (బ్రహ్మ, విష్ణు, మ హేశ్వరులు) ముగ్గురు సాధువులుగా మారి భూలోకమునకువచ్చి కుచేలుని భ క్తితత్వములను పరీక్ష జేయబూనుట. సాధువులు భిక్షాందేహిః అని కుచేలునివద్దకు వచ్చుట. ఆకలిబాధచే రోగపీడితుడై బక్కచిక్కి_న కుచేలుని పుత్రుడగు రాఘవుడు తన తల్లియగు వామాక్షికి అతిథిపూజా ప్రోత్సాహము. అతిథి సత్కార్యముకొరకు వామాక్షి కరకటశాస్త్రి యింటియందు వూడిగముజేయుట. పెండ్లి కరకటశాస్త్రి బావయగు దీక్ష తుని పరితాపము . గయ్యాళిగంపయగు కరకటశాస్త్రి భార్యయగు సరోజిని భర్తను నిందా గర్భితవాక్యములాడుట. వామాక్షిని బహుకరింపక ధౌర్జన్యముచే కరకట శాస్త్రి తనయింటనుండి వెడలగొ 3 చిగట ట్టుట, కుచేలుడు తన కుటీరమున తన్ను రక్షింపమని ప్ర్రార్ధించుట. శిశుపాలదర్భారునకు సరళ యనెడి ఒక గోపబాలికను సిపాయిలు బం ధించి తీసుకొనివచ్చుట. దుర్మార్గుడుగు శిశుపాలుడు ఆమెపై నిర్దయుడై గదియందు బంధించమని ఆజ్ఞయిచ్చుట. కరకటశాస్త్రి శిశుపాలరా జేంద్రునితో కుచేలుడు రాజద్రోహి అని చెప్పుట. నారదుడు దానిని పాడు కుచేలుని తన దర్భార మనకు దీసుకొని ఆమోదించుట. రమ్మని యాజ్జయిచ్చుట. సరళ ఆనాటి రాత్రి శ్రీ కృష్ణుని ధ్యానించి ప్ర్రార్ధనచేయుట. ఆసమయమున నే శిశుపాలుడు ఆమెను బలత్కరించుటకు సమీపించుట. సరళ భయపడి శ్రీకృష్ణుని ప్రార్ధించుట శ్రీకృష్ణునిమాయచే శిశు పాలుడు మూర్ఛనొందుట. శ్రీకృష్ణుడు సరళకు నీవేగా కొన్పించి. ఆ మెను తప్పించుకొనిపొమ్మని తెలియపర్చుట. అంతట ఆమె సారిపోవుచుండ గా జగజ్జాలుడగు శ్రీకృష్ణుని మాయచే సిపాయిలు మూర్ఛనొందుట. సాధువులు కుచేలునింట భిక్ష పెట్టమని బాధ పెట్టుట. ఇంటరోగ పీడితుడైన కుమారుడు రాఘవుడు శోభిల్లులు, ఆకలిచే ఆక్రందనము. కుచే లునికి కఠినపరీక్షా సమయము . ఆసమయమున నే శిశుపాలుని సిపాయిలు వచ్చి కుచేలునిరాజద్రోహిగా బంధించి తీసుకొనిపోవుట, దుఃఖాక్రాంతుడై రోగ పీడితుడైన రాఘవుడు మంచమునుండి పడిపోవులు. దుర్భరకష్టపీడితు రాలైన వామాక్షి మూర్ఛనొందుట. సాధువులు అనందించి అంతర్ధాన 'మగుట. మూర్ఛనుండి లేచిన వామాక్షి శ్రీకృష్ణునిసమీపించి కాపాడమని ప్రార్ధించగా విగ్రహమునుండి శ్రీకృష్ణుడు అవతరించి ఫలములలో నున్న పళ్లెరమును వామాక్షికి అందజేసి అంతర్ధా రానమగుట. శిశుపాలుని సిపాయిలు కుచేలుని బంధించి శిశుపాల రాజేంద్రునకు వప్పజెప్పుట. రాజుయెంత చెప్పినను కుచేలుడు కృష్ణభ క్తినివిడువనని చెప్పుట,
పుట:Bhaktha Kuchela 1935-Song Booklet.djvu/3
స్వరూపం