ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్రీ కోటిలింగేశ్వర స్తోత్రము
కీ. శే. శ్రీ మన్మహోపాధ్యాయ బ్ర. కల్లూరి వేంకట రామశాస్త్రి గారు
[వారాణసీ క్షేత్రమునకుఁ బ్రతివాదియని విశ్రుతి కెక్కి దక్షిణదేశంబు నధివసించిన యీ కోటిలింగక్షేత్రంబున నొకానొక శివరాత్రి పర్వకాలంబునందు రథారూఢుం డగు కోటిలింగేశ్వరుండు తనదు దర్శనంబున నుల్లంబు నుల్లాసంబు నొందించి నన్ను స్వకీయస్తుతి విషయక మనోరథారూఢుం జేయంగ ధూర్జటిజటిలభక్తిభాసుర కవితా వితాన శాలిశయ్యతో సశేషరసజ్ఞాసీమసుధా మధురంబయ్యును సశేషరసజ్ఞా సీమ సుధామధురం బగు నట్టులు 16-6-1899 నాడు రచియింపఁబడిన పద్యరత్నంబులు.]