పుట:Bhaarati sanputamu 8 sanchika 1 jan 1931.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రస్తుతపు మాయాపురము నంటుకొని గంగాతీరముననే మైలు మైలున్నర దక్షిణముగ వ్యాపించియున్నది. కాబట్టి మిక్కిలి ప్రాచీనకాలమున జనావాసయోగ్యములగు గృహములేమియు లేక కేవలము గంగాద్వారమనుపేర గుడియొకటి మాత్రముండెననుట స్పష్టము. కాని యా స్థలము చుట్టుప్రక్కల నొప్పు రమణీయ ప్రాకృతికసౌందర్యముచే ఆకృష్టులై సంసారవిముఖులైన యోగులు, తపస్వులు, మౌనులు లోనగు నేకాంతవాసాభిలాషులు వారివారి కనువగు ప్రదేశములలో పర్ణ కుటీరములు నిర్మించుకొని ధర్మాచరణములు సలుపుకొనుచు వచ్చిరి. ఈ మహాత్ముల దర్శించి వారి నుండి హితోపదేశములు బడయుటకై సాధారణ గృహస్థులే కాక సంస్థానాదీశులు, రాజులు, మహారాజులుగూడ వచ్చుచుండిరి.