పుట:Bhaarata arthashaastramu (1958).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైపటమున రాశిపరిమాణము 1, 2, 3, 4, 5 అంకములు గల రేఖాభాగములచేతను మమతయొక్క యుద్రేకము అనగా వాంఛ అ, ఆ, ఇ, ఈ మున్నగు నూర్థ్వరేఖలచేతను మమతయొక్క పరిమాణము క, గ, చ, జ, ట యనంబరగు రేఖావృత రూపములచేతను దృప్తి డ, త, ద, ప, బ యను రేఖావృత రూపములచేతను సూచితములు.

రాశి యొకవంతుగానున్న మమతయొక్క యుద్రేకము తీక్ష్ణముగానుండును; ఆ వంతువలన గలుగు తృప్తియు నధికముగనే యుండు (డ). ప్రారంభదశ యగుటంజేసి మమత పరిమాణము మాత్రముకొలది (క). రాశి ద్విగుణమైన మమతయొక్క ఉద్రేకము తగ్గును (ఆ). తృప్తియు క్షీణదశయందెయుండు (త). మమత పరిమాణము మాత్రము వృద్ధియగును (గ). అయిన నీవృద్ధి రెండితలు గాక కొంత కొఱవడును. అనగా మమత పరిమాణము హీనవృద్ధికి