పుట:Bhaarata arthashaastramu (1958).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

వాంఛలకును యత్నములకునునుండు సంబంధములు

వాంఛలా ప్రయత్నములా యాద్యములు?

ఈ ప్రశ్నకు సరియైన యుత్తరము దుర్లభము. ఇవిరెండు నొకదాని నొకటి యాని యుండుననుట యుక్తము. ఎట్లన, ఏప్రయాసయులేక యూరక మూలగూలబడియుండుట కెవనిచేతనుగాదు. ఇట్టి నిశ్చలతత్త్వము నిర్భరతత్త్వము. బాధనివారించుకొఱకు లేచి యించుక పరిశ్రమించితిమేని తద్ద్వారా పరిశ్రమాభిలాష హృదయముననాటును. కావున వాంఛలచే యత్నములును, యత్నములచే వాంఛలును ఉద్ధురములవుట సత్యము.

వాంఛాస్ఫూర్తియు కార్యోత్సాహమును పరస్పరాశ్రయములైనను మొత్తముమీద కార్యారంభమునందే యెక్కువ దృష్టి యుంచవలయును. ఊరక యాశల బెట్టుకొనుచు ఉద్యోగమనునది యావంతయులేక మనదేశములోని విద్యావిధు లున్నట్టులున్న ఫలమేమి? సాహసమునకు బ్రేరేపకములుగాని యడియాసలు గలిగి యుంట మగతనముగాదు. మఱి గొడ్డుదనము.

నిష్కర్మత్వము కాముకత్వమునకు నుద్రేక కారణము! ఈవింత యెట్లందురో వినుడు. సాహసవంతుడు సాధ్యములను మాత్రము కాంక్షించును. తన శక్తికిమించిన వానింగూర్చి యువ్విళ్ళూరుట నీచ బుద్ధియని విరమించును. ఏదేవుడైన దయ్యమైన తానే దయారసముమై మేలుచేయవచ్చిన "మీభిక్షాప్రసాదము నాకువలదు. అర్హతకొలది లభించిన జాలును. మీప్రభావము మీదాసుల