పుట:Bhaarata arthashaastramu (1958).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలము రావలయునని పిచ్చివాడుతప్ప దదితరు డెవడైన సాము జేయబూనునా ? నక్షత్రలోకములో నిల్లుగట్టికొని వసింప నెవడపేక్షించును ? కావున మన కసాధ్యములని స్పష్టముగ దెలిసిన వానియందు సాపేక్షుల మెన్నటికినిగాము. సాధ్యములని నమ్మినవాని యందే నరుండు తఱుచు కాముకుం డగును.

2. మఱియు శ్రమ దు:ఖభాజనంబు. వస్తువులు స్వభావముగ సుఖము నొసగునవి. వస్తాధిక్యము సమకూర సమకూర సుఖము హీనత జెందును. ఈ న్యాయమును బటములో సూచించిన దెల్లమగును.

రాశి యెక్కువయగుకొలది వాంఛాసుఖంబులు తక్కువలగును. తుద కపరిమితమగుడు కష్టమేయగును. కష్ట మారంభించిన వెనుక నిది సుఖమువలె దగ్గుటలేదు. మఱి సదా, కారణమైన వస్తువు వృద్ధియగునట్లెల్ల, నిదియు నెక్కువయగుచు వచ్చును. ఈ విషయమే మునుపు నీటి సామ్యముచే బోధించితిమి. (1 వ పటము చూడుడు. తొలిగ్రుక్క మహదానందదాయి. త్రాగను ద్రాగను అభిరుచి లాఘవంబు నొందును కొంతవడికి సుఖముగాని కష్టముగాని లేని మధ్యస్థితి ప్రాప్తించును. ఇంకను మతిలేక త్రాగినచో గష్ట