పుట:Bhaarata arthashaastramu (1958).pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అమ్మువానియోచన :- నాకిన్ని యెద్దులున్నవి. ఈయొక యెద్దుచే నీరాశింబట్టి నాకుండు ప్రయోజనమేమి ? 2. నాయావుల సంఖ్యయింత. కావున నీఆవుంగొనుటచే లభించు ప్రయోజనాధిక్యం బెంత ?

కొనువానియోచన :- నాకిన్ని యావులున్నవి. ఆ రాశింబట్టి ఈ యావుచే గలుగు ప్రకర్ష మెంత ? 2. నాయెద్దుల సంఖ్య యీమాత్రము. ఈ క్రొత్తయెద్దు లభించునేని యేమాత్రము ప్రయోజనాధిక్య మలవడును ?

వినిమయ మెప్పుడు జరుగుననగా, ప్రతివానికినిఇచ్చు వస్తువునకైన గొనువస్తు వొక్కింత యంత్యప్రయోజనము నధికముగా గలదియైన లేనిచో బేరసారములేల ? చేతనుండు దానికన్న నెక్కువ ప్రయోజనకారిగాకున్న నితరవస్తువుతో నేమిపని ? కావున వినిమయములలో నుభయకక్షులును ప్రయోజనాధిక్యముంబడసి కృతార్థులౌదురు. ఉభయులు లబ్ధలాభులౌట యనిత్యమేని వర్తకములు వ్యాపించియుండునా ?

అంత్యోపయుక్తిలేని పదార్థములకై ఎవ్వడును దాటుపడడు. అంత్యోపయుక్తిలేనివనగా మితమునకు మించిన రాసులున్నవియనియు నద్దానంజేసి వానియందు మమతలేదనియు భావము. ఇష్టములేనిచో నెవడైన శ్రమ పుచ్చుకొనునా ? మఱియు నిచ్ఛాపూర్తికి వలయు బండములుండగా వానినెక్కువ చేయుట కెట్టిమూడుడు నుద్యమింపడు. కావున వాంఛలకును శ్రమమునకును బరస్పర సంబంధము గలదు. దీని విధంబు స్పష్టముగ దెలియజేయుదము.

వాంఛలకు యత్నములకునుండు పరస్పరత

1. అమానుషశక్తిచేగాని సాధింపరాని యుద్యోగముల నెట్టివాడు నాసింపడు. హనుమంతునివలె గొండలు మోయగలిగినంత