పుట:Bhaarata arthashaastramu (1958).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట రెండవపటమున మూడవ గిఱ్ఱయే యంత్యప్రయోజనము సూచించును. ఉదా. పంటలు చెడెనేని ధాన్యపు వెల హెచ్చుట.

2. రాశి యట్లేయుండి గిరాకి హెచ్చుటచేత అనగా నాదరము వృద్ధియగుటచేత.

ఉదా. పెండ్లికాలములను చైత్రవైశాఖ మాసములలోను బట్టల ధరలు హెచ్చుట.

వాంఛాపూర్తికి ననుగుణమగురాశి యెక్కువ కానుగాను. గిరాకి యట్టులేయున్న, దాని యంత్యప్రయోజనమును, విలువయు క్షీణతనొందవచ్చును. రాశి శుక్ల పక్షము నవలంబించిన మూల్యము కృష్ణపక్షములో జేరును. కోరికకుమీఱిన రాసులున్న విలువ యస్తమితమగును. అంత్యోపయుక్తితో గూడిన పదార్థములకెల్ల సమస్తోపయుక్తియున్నను సమస్తోపయుక్తితో గూడిన వానికెల్ల నంత్యోపయుక్తి యున్నదను నిశ్చయములేదు.

ప్రతిబేరమునందును - అనగా వినిమయ క్రియాసమయమున - నాలుగు విధముల యంత్యప్రయోజనముల సరిపోల్చి చూచుట సిద్ధము. ఉదా. ఆవునకుమాఱు ఎద్దును గొన నుద్యమముండెనేని:-