పుట:Bhaarata arthashaastramu (1958).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలలగుదియించెనేని మనకాపులు మంచివెలలులేవని పంటల దగ్గింతురు. యంత్రములచే దయారుచేయబడు నీలిప్రసిద్ధికి వచ్చినదే. నెల్లూరు మొదలగు ప్రాంతములవారు నీలిపంటల జాలించి యుండుట తెలియదా ? అనగా నిప్పటి ధరల ప్రకారము పూర్వమున్న నీలి రాశిలో గొన్ని భాగములకు బ్రయోజనము భగ్నమాయెననుట. (అనగా నారాశికి నంత్యప్రయోజనము సడలెననుట) కావున రాశి తగ్గింపబడియె. మరల నేదేనొక కారణముచే బంటనీలికి గిరాకి హెచ్చెనేని నాయాదరాధిక్యముతో నంత్యప్రయోజనమును వికసించును. వెంటనే విలువవిలసిల్లిన బంటలిప్పటివలె ముకుళితస్థితిలో నుండవు. అంత్యోపయుక్తియు మూల్యమును రెండు శరీరములం జెందిన యేకాత్మయట్టివి.

రాశిచే నంత్యోపయుక్తియు మూల్యమును నిర్ధారితములు. మఱి యంత్యోపయుక్తి మూల్యములచే రాశినిర్ధారితము. ఉదా. నీలికిని అంత్యోపయుక్తి (అనగా మూల్యము) హెచ్చిన నెక్కువ రాసులు పండింపబడును. కావున రాశియు మూల్యమును పరస్పర విదానములు.

గాలి మొదలగు నవ్యయరాశివస్తువులకు సామాన్యముగ విలువ లేకున్నను దేశాదివిశేషములంజేసి విలువ యేర్పడుటయుంగలదు. ఉదా. 1. ముత్తెపుచిప్పలకొఱకు సముద్రములో కెంతయో లోతునకు దిగినవారికి గొట్టములగుండ గాలి గొట్టుదురు. దీనికై యిన్ని ఘనపుటడుగుల గాలి కింతయని ధరల విధింతురు. 2. ఊపిరియాడని మహాపట్టణములలో మంచిగాలి పాఱునిండ్లకు బాడుగ కొంచె మధికము. ఇది గాలికొఱ కియ్యబడిన వెలయేకదా !

మూల్యము వినిమయసంబంధి. అనగా వస్తువుల బేరసారములలో మార్చుకొనుటయందు దీనికింత, దానికీమాత్రము అని యేర్పడు విలువ. వ్యవహారపరివర్తనము లేనిదైనచో ప్రయోజనములుండుగాని