పుట:Bhaarata arthashaastramu (1958).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాశికి మించిన కోరికలున్న నారాశియొక్క యంత్యభాగమునకుం బ్రయోజనము సిద్ధము. కోరికకు మించిన రాసులున్న నంత్యభాగములతో నెవరికేమిపని ? అవి ఱిత్తలు.

అంత్యోపయుక్తియే లేనియెడల మూల్యముండదు. అనగా గోరికకుమించిన రాసులున్న వానిని బదులు సరుకులిచ్చికొన నెవ్వడును గోరడు. అంత్యోపయుక్తియున్న మూల్యము తప్పదు. అనగా రాశికిమించిన కోరికలుంటచే వా రాసియెడ జనుల కాదరమున్నదనియు, దానంజేసి సరుకుల మాఱొసంగియైన దానింబడయ జూతురనియు ననుట.

చూచితిరా ! ప్రయోజనమునకును మూల్యమునకును ఇంత సేపునకు నిర్ధారణకువచ్చిన సామ్యము !

ఆద్యోపయుక్తికి, సమష్ట్యుపయుక్తికి, మూల్యమునకును సంబంధములేదు. ఉదా. గాలికి ద్వివిధోప యుక్తులుదట్టము. మూల్యమునహి.

అంత్యోపయుక్తియు మూల్యమును నిత్యసంయుక్తములు. మూల్య మంత్యోపయుక్తిచే నిర్ధారితము. ఉదా. రాశి ననుసరించి యంత్యోపయుక్తి యుండును ఆ తక్కువ యుపయోగముగల భాగమునకేమి వెలయో యదియే ప్రతిభాగమున నావేశించిన మూల్యము. పీపాయినీరు అమ్మకమునకుండిన తొలిచెంబు మిక్కిలి యుపయోగకరము. కడపటిది యధమము, అయ్యును ఈ యధమరాశికి నేమిత్తురో యంతకన్న నెక్కువ తత్పూర్వరాసుల కిచ్చుట గానేరదు. రాశి ననుసరించి యేర్పడిన కనీసము ప్రయోజనమున కేమి యిత్తుమో యదియే రాశియొక్కయు ప్రతిభాగముయొక్కయు విలువ, 500 పుట్లకాలములో 100 పుట్లనాటికన్న వడ్ల యంత్యప్రయోజనము తక్కువ. ఈ తక్కువంబట్టి యేర్పడిన నయమైన వెలయే ప్రతి పుట్టియొక్కయువెల.

అంత్యోపయుక్తిచే మూల్యము నిర్ణీతమగునని యంటిమి. బర్మా మొదలగు దేశములనుండి బియ్య మమితముగ దిగుమతియై