పుట:Bhaarata arthashaastramu (1958).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందుండు రాశినంతయు గణించి, దానిచే నేవెల తటస్థించుననుట విచారించి యావెలకు దీయుదుము. కాన భాగభాగమునకు నొక్కొక వెలయునుకొనము. తినుట మొదలగు వినియోగ క్రియలయందును కార్యాంతమునగాని సుఖంబు స్ఫురించకున్న మీవాద మొప్పుకోవలసినదే. కార్యారంభమునుండి - ఒక్క యారంభమునుండియా ? దూరమునుండి వాసనలు గుప్పించుసరికే - సుఖము ప్రసన్నమగుట మీరెఱిగినదేకదా ! విలువయందిట్లా ? కాదు. రాశియేర్పడిన తదనంతరము విలువ యేర్పడును. భుజించి ముగించిన పిమ్మట నేమి సుఖమున్నది ? కడుపు బరువొకటేకాక ! కాబట్టి మూల్యము, వస్తువు యొక్కరాశి కుదిరిన పిమ్మట దాని పరిమాణము ననుసరించి ప్రతి భాగమునకును గుదురు వస్త్వంతరతారతమ్యము. అట్లగుట నెల్ల భాగములకును రాశికొలది నేకరూపమూల్యముండును. ప్రయోజన మన్ననో నానావిధ పరిమాణములు గలది.

3. మూల్యమునకుం బ్రయోజనమునకును నిరంతర సంయోగముం గలిగింప ననుభవవిదితంబులైన మఱికొన్ని వర్తమానములును బాధాకరంబులు.

ఎట్లన:- గాలి యుపయోగకరమందురా ? అనగా ? నిస్సంశయముగ నుపయోగకరమేయని యొప్పితీరవలయును. బంగారు, వెండి వీనికన్న నిదిప్రధానము. ప్రాణాధారపదార్థము. అవునుగాని గాలియొక్క వెలయెంత ? సామాన్యముగ సున్న. అనగా నంత్యమూల్యము పూజ్యమనుట. కావున నంత్యప్రయోజనమును పూజ్యమే. అంత్య మూల్యము పూజ్యముగాన ప్రతిభాగముయొక్క మూల్యమును బూజ్యమే. కావున గాలి మూల్యము శూన్యమనుట సర్వసమ్మతము.

ఇక ప్రయోజనముంగూర్చి యిదే వ్యాఖ్యజేసి చూడుడు ! ఎంత యాభాసముగానుండునో ! అంత్యప్రయోజనము సున్న. కావున ప్రతిభాగముయొక్కయు ప్రయోజనము సున్న. గాలి యెందునకుం