పుట:Bhaarata arthashaastramu (1958).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకింతపండిన కాలమునకన్న నెక్కువయింతల కాలములో వెలలు తక్కువయననేమి ? నూతనముగ బండిన భాగమునకుమాత్రము తగ్గుననియా ? కాదు. ఇంకెట్లు ?

100 పుట్లనాడు పుట్టికి వెల 10 రూపాయ లుండునను కొందము. 500 పుట్లనాడు పుట్టికి వెల 8 రూపాయలుండును. ఇపుడు తొలి 100 పుట్లకును 8 రూపాయలే కాని వెల యెక్కువ యుండబోదు. అనగా విలువ, వెల వీనివిషయములో నొకభాగమునకు నేపరిమాణము ఖరీదు సమకూరునో తదితర భాగములకు నదేపరిమాణము సమకూరుగాని, వివిధరీతుల పరిమాణము అనగా రాశిలోని భాగములకు నుండవు. కావుననే రాశియొక్క మొత్తపువెల సూచించునపుడు, తక్కువవెలగల భాగముయొక్క వెలయే తక్కిన వానియు వెలయనియు, ఈ ఖరీదును భాగముయొక్క సంఖ్యతో గుణించిన మొత్తపువెల ఘటిల్లుననియు శాస్త్రసిద్ధాంతము.

3. ఇంతలవేళలో మొత్తపుఖరీదు 1, 3. అ, ఆ. లచే నావృతమైన మండలము. అనగా భాగములు మూడింటికి ప్రతియొక్కటికి వెల 6, అట్లే. 5 ఇంతలవేళలో ప్రతిభాగమునకు వెల 2. మొత్తపు విలువ 1. 5. ఇ. ఈ. లచే వేష్టితమైన చక్రము.