పుట:Bhaarata arthashaastramu (1958).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ప్రయోజనము రాశిననుసరించి యుండును. అనగా నంత్య భాగముయొక్క ప్రయోజన మనుట. లోకమున నినుము రీతిని బంగారము సర్వసాధారణముగాదు. అనగా రాశి లఘువు కావున ముఖ్యత గురువు. ఇక వినుమన్ననో దీని కెల్లభంగుల విరుద్ధము. రాశి ఘనము. ప్రాధాన్యము చుల్కన.

3. అయిన నొక సంశయము. ఏమి ? నిజము చూడబోయిన నినుమునకన్న బంగారము ప్రయోజనకారియా ? కాదు. లోకమున బంగారము మాయమైన జీవితము కష్టముగాదు. కాని యినుము లేకున్న బ్రదుకు పాడగును. కాబట్టి బంగారమునకన్న నినుము శ్రేష్ఠము. అట్లయిన మూల్యమునందును నేల ప్రౌఢతరముగాదు ? ప్రయోజనముంబట్టి మూల్యముండుట నిజమేని ఇనుమునకన్న బంగారునకు వెల తక్కువ యుండవలదా ? ఇంతేకాదు. గాలికిలేని ప్రయోజన మేసామగ్రికి గలదు ? అయినను గాలియొక్క మూల్యము సున్న. కొనువారులేరు. సంతలకని సంచుల నింపువారులేరు ఇందు ప్రయోజనముండియు విలువ వెలయదయ్యె.

ఈ విశేషముల కేమిసమాధానము ! వినుండు :-

ప్రయోజన మనునది సందిగ్థపదము. దానికర్థము లనేకములు. ఎవ్వియన రాశికిని వాంఛకును గలసామ్యము నీ పటము సూచించెడు జూడుడు.