పుట:Bhaarata arthashaastramu (1958).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎట్లైననుసరే మూల్యములేనిది పరివర్తనము జరుగదు. అనగా తనవస్తువును బదులిచ్చి తనకెందునకు నుపయోగమునకురాని వస్తువుగొన నెవడునుకోరడు. కావున వినిమయమునకు (మార్చుకొనుటకు) విలువ యధారభూతమనుట స్ఫుటము. ధర యంత ముఖ్యముగాదు. నాగరికత లేనిదేశములో నేటికిని నాణెములులేవు. మనదేశములోను నడవిమనుష్యులు రూపాయిల మాధ్యస్థ్యములేని పరివర్తనము జరుపు కొనుచున్నారేకాని నాణెము లనగానేమో యెఱుగరు. వారు బజారునకు తేనె, మైనము మున్నగునవితెచ్చి నేయి, నూనె, ఉప్పు, మిరపకాయలు ఇత్యాదులకై బదులిచ్చి మార్చుకొని యడవులకు బోవుట యందఱెఱిగిన విషయమేకదా ! కావున మూల్యమునకును క్రయవిక్రయముల నెక్కువ సరళముగ జరుపుకొనుటకు సాధనములగు నాణెములద్వారా నిర్ణయింపబడిన మూల్యపరిమాణమగు ధరకును, మిగుల వ్యత్యాసము గలదనుట స్పష్టము.

ఇవిరెండు నిట్లు భిన్నములైనను నొండొంటితో సంబంధించినవే కాని సంబంధము లేనివిగావు. మూల్య మధికమగుకొలది వెల హెచ్చుటయు, తక్కువ యగుకొలది తఱుగుటయు ననుభవ వేద్యములేకదా !

మూల్యము ఏకవస్తు గర్బితముగాదు

ఉపయుక్తత సర్వార్థములకును సాధారణమైన ధర్మంబు. అర్థముల నొండొంటితోబోల్చి యభిలాషకొలది నొండొంటితో గొలుచుటచేత మూల్య మింతయున్నదని యేర్పడును. లోకమున నొకేవస్తువు మాత్రముండినచో నది యెంత ప్రయోజనకారియైనను నద్దానియొక్క తారతమ్య నిర్ధారణకు బరపదార్థంబు లేమింజేసి దానికి మూల్యము సున్న. మూల్యమనగా 'ఇంతమాత్రము నాకు ప్రియము' అను నిర్ధారణ 'ఇంతమాత్రము' అను నిర్ణయము ఇంకొకవస్తువుతో బోల్చి తులదూచినంగాని తేలదు. ఈ 'యింత' నే