పుట:Bhaarata arthashaastramu (1958).pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. ప్రతి వ్యవహార చక్రములోనునుండు శాలలన్నియు 'నేముందు మేముంద' ని ద్వేషబుద్ధి నొండొంటి గడవబూని, యప్పుడప్పు డన్నియు బల్లములో బడుట.

అన్యోన్యతాపద్ధతియొక్క ముఖ్యగుణంబులన్ననో

1. ధనలాభమాత్ర మాశింపగూడదనుట. ధనమునకంటె క్షేమముమేలు.

2. వ్యవహారాదుల సంఘక్షేమపరమైన దృష్టితో నడపవలయు ననుట.

3. చిల్లర స్పర్ధలు తగవు. గొప్ప గొప్ప కూటములుగా నేర్పడుట యుక్తము.

కాబట్టి యార్థిక రంగమున నీ రెండువిధములైన స్పర్ధలు ప్రతిఘటించి యున్నవి. ఇక ట్రస్టులును నీ రెండింటిని మ్రింగి ఇంకొక విధమైన శక్తిచే (అనగా విశ్వరూపముదాల్చి యందఱిని భయకంపితులంజేసి) నేకచక్రముగ వ్యాపారప్రపంచము పాలింప బ్రయత్నించెడును. శిల్పులు నూరకుండునట్లు కానము. ఘనములైన కర్మకర సంఘముల సంఘటించి యజమానుల నోడించి తామే యవక్రముగ నన్నింటిని తల్లక్రిందుగ జేయుదమని వారును వున్నారు, కావున స్పర్ధలు నిరోధింప బడుచున్నవని సామాన్యముగ నందఱు పలుకునట్లు పలుకుటకన్నను, వివిధస్పర్ధ లొండొంటిందాకి పెనంగుచున్నవనుట యింకను నొప్పు.


భారత అర్థశాస్త్రము సర్వము సమాప్తము.