పుట:Bhaarata arthashaastramu (1958).pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనశరీరమునందును నీవీఠోద్యోగములు విరామములేక పఱుగుచున్నవి. ఎట్లందురో? కలరా, మహామారి, చలిజ్వరము వీనిని కలిగించు పురుగులు మనదేహములో జొరబడ వేచియున్నవి. వానికి జోటియ్యక దేహశక్తి యడ్డపడెడును. అనగా సాధ్యమైనంత దనుక. మఱి జ్వరము వచ్చెబో, దానిని రూపుమాప సహజముగ శరీరముద్యోగించును. ఇంకను అమితభోజనము, అమితినిద్ర ఇత్యాది నిజస్వభావ విరుద్ధక్రియలకు నేయంగములైనబూనిన వానికి మాంద్యం, నొప్పి, వాపు మొదలగు శిక్షల విధించును.

స్పర్ధ ప్రాణులకు సహజము. ఈస్థూలప్రపంచముయొక్క ప్రధానగుణంబులలో నొకటి.

కావున స్పర్ధను నిరోధించు పద్ధతులనగా, నిప్పుడు దాదాపు నూఱేండ్లుగా బశ్చిమసీమలలో వ్యాపించిన స్పర్ధను అనుటగాని, సర్వవిధములైన స్పర్ధలను అనుటకాదు. అన్యోన్య పద్ధతులంగూర్చి యోచింపుడు. ఇవి ప్రాచుర్యమునకు రావలయునన్న తదితర పద్ధతుల బడగొట్టవలయు. మఱియు నీ యన్యోన్యతా భావముగలవారికిని మేలు చేసినను తక్కిన వారిని చేరనియ్యక తఱుమజూచును. కాబట్టి పరమ శాంతి పీనుగులకుగాని ప్రాణులకు బట్టువడుట యస్వాభావికము. అంత చల్లదనము రావలయునన్న నూపిరి పోవలసినదే.

మాత్సర్యము నిరోధించుట యనగా నొకవిధమైన మాత్సర్యమును నొంకొకవిధమైన మాత్సర్యము నవలంబించుటచేత ననియర్థము. అట్లయిన నన్యోన్యతాది పద్ధతులు విదళింపజూచు నిప్పటి స్పర్ధయొక్క లక్షణము లెవ్వియనిన:-

1. ప్రతివాడును దనలాభముమాత్రమాశించి యితరులెల్ల రులతోను వైరంబుదాల్చి యుపక్రమించుట.