పుట:Bhaarata arthashaastramu (1958).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుపకారముం జేయునవియయ్యును అవి నిజమైన యన్యోన్యతా వర్గములుగావు. మఱి కృత్రిమములు. సామాన్యములైన కంపెనీల వంటివి. అనగా ధనసంపాదనముందప్ప నింకేయర్థమును బాటింపనివి.

విక్రయములకై స్థాపింపబడిన వినియోజక (లేక విభజన) పరస్పర సమూహములుగాక ఉత్పత్తి - అనగా వస్తురచనాదికళ - నెఱవేర్చుటకై యా క్రమము నవలంబించిన యుత్పాదక పరస్పర సమాజములుం గలవు. ఇవి విక్రయశాలలట్లు ఘనతరములుగావని యీ సంఘముల గుణదోషముల జర్చించు నవసరంబున సూచించితిమి. ఇందులకు చరిత్రాంశములును సాక్ష్యము నిచ్చుచున్నవి ఎట్లన;

ఇంగ్లాండులో 1890 సంవత్సరాంతముననున్న పరస్పర వర్గముల వివరం

- సంఖ్య సామాజికుల సంఖ్య మూలధనము (సవరనులు)
విభజన సమాజములు 1418 10,26,912 10,607,432
ఉత్పాదక సమాజములు 119 27,214 597,933
ఇతరములు 16 62,929 10,56,587

వీనియొక్క వృద్ధివేగముందెలుపు నంశములు

సంవత్సరం సమాజముల సంఖ్య సమాజికుల సంఖ్య మూలార్థము (సవరనులు)
1866 915 174,993 1,046,310
1876 1165 507,857 5,304,019
1886 1296 835,200 9,297,506
1890 1554 1,117,085 12,261,952

పనివాండ్రచే నిండిన యీ సమాజములు మిక్కిలి తక్కువ వడ్డీకి 2,800,000 సవరనులను బ్యాంకీలు మొదలగు ఋణదాయి వర్గములనుండి వ్యాపారార్ధ మప్పుబడచినవి. ఇదిచూడంగా నికముందు మూలధనము లవారు కూలికి శ్రమకరులను నిలుపుకొనుటపోయి శ్రమకరులు వడ్డీయనుకూలినిచ్చి మూలార్ధములంగొని ప్రభువుల పదవిం జెందుదురేమోయని తోచెడిని!