పుట:Bhaarata arthashaastramu (1958).pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలయు. ఒక్కపలము చక్కెరను మొత్తపువెల ప్రకార మెవ్వడు నమ్మడు. ఒక్క మణుగుగొంటిమేని వర్తకులు ధరలదగ్గించియిత్తురు.

చూడుడు! అట్లగుటంజేసి కూలివారు మొదలగు బీదలు మొత్తపు ధరలకు గొప్ప మొత్తముల గొనవలయునన్న నుపాయ మెట్లు? వారు సంఘములుగాజేరి కొనుటయే . అట్లుకాకొని వస్తువుల విభాగించుకొనిరేని వ్యయము మిగిల్చినవా రగుదురు. ఇదియే వినియోజక సమాజముయొక్క ముఖ్యఫలమును దాత్పర్యమును.

1844 వ సంవత్సరమున 'రాక్‌డేల్‌' అను పట్టణములో 28 మంది శిల్పులు కూటముగనేర్పడి భోజ్యముల మొత్తముగగొని యంగడి వెలలకే తమలో దమకు నయ్యవి విలిచి, సెలవులుపోగా మిగిలిన లాభమును అప్పుడప్పుడు పంచుకొన నారంభించిరి. వీరిచర్య యీ సంఘములసిద్ధికి బీజమువంటి దనుటలో నతిశయోక్తి యేమాత్రమునులేదు. మహానదుల జన్మస్థానములు అల్పప్రవాహములుగ నుండురీతిని పరస్పరతాపద్ధతియు నీచిన్నియుద్యమమున నుద్భవించిన దాయె! మార్గదర్శకులైన యీ సమాజములవారు లాభములో నొకపాలు దుకాణములోని సేవకులకును మఱియొకపాలు తమవారికి జదువు సాములు చక్కగా నేర్పుటకునై యెత్తిపెట్టి మిగిలిన భాగము మాత్రము తాము స్వీకరించునట్లు సమయంబొనర్చి యన్యోన్యతను నిలిపిరి.

తదనంతర మిట్టిసమాజము లనేకములు వెలువడినవిగాని, స్వలాభాపేక్షచే సాంఘికులు కొన్నియెడల శ్రమకరులకు భాగము లేర్పఱుపక యావత్తును తామే సంగ్రహింపం దొడంగిరి. ఇవి సామాన్యములైన భాగస్థులుకలసి చేయు వ్యాపారములవంటివి. సామాజకులు భాగస్థులవంటివారు. వచ్చినలాభము దామే స్వీకరింతురు. సామాజకులే వాడుకకాండ్రుగదాయని యందురేమో? అయిననేమి? కంపెనీలలో భాగస్థులు వస్తువులు గొన్న వద్దనువారు గలరా? అట్లగుటంజేసి యిది నిజమైన తారతమ్యముగాదు.