పుట:Bhaarata arthashaastramu (1958).pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిని దలయెత్తనీయక హీనస్థితిలో నుంచునట్టి ప్రమాదమెయ్యది యన, జ్ఞానశూన్యత. ఇప్పటి కాలములో వ్యవహారములు విస్తారము నొందినంగాని సమగ్రఫలంబులుగావు. విస్తార వ్యవహార సంఘటనకు దత్సంబంధములైన యన్నివిషయములయొక్కయు జక్రముల యొక్కయు నుదంతములనెఱింగి యాలోచనతో వర్తించుట ఆవశ్యకము. ఇది సర్వజ్ఞులకేకాని లాతివారలకుం జెల్లదు. శిల్పు లెన్నియో విధంబుల నారితేఱినవారైనను విద్యావధానంబుల బరిశ్రమ లేనివారగుటం జేసి వలసినంత ధీశక్తిబడయుట వారికి సులభంబుగాదు.

అయినను నీకాలమున బశ్చిమ రాజ్యములలోని జనులెల్లరు చదువను వ్రాయను నేర్చినవారగుట చేతను, పుంఖానుపుంఖములుగ వార్తాపత్రికలుండుటచేతను, ఈకొఱంతయు గొంతకుగొంత వారింప బడుచున్నది.

పరస్పర సముదాయముల చరిత్రము

ఈ క్రింద బేర్కొనబడిన దేశములయందలి ముఖ్యాంశములు మాత్రము గొన్నింటి నిట బొందుపఱచు చున్నామని తెలియునది.

1. ఇంగ్లాండులో:-

ఈ సముదాయములు రెండు జాతులు, వినియోజకములు, ఉత్పాదకములు. అనగా వినియోగము, ఉత్పత్తి వీనిని సరసముగ నడపించుటకై వినియోజకులు, ఉత్పాదకులునుగలసి కట్టిన పరస్పర సహాయ సంఘములనుట.

వినియోజకాన్యోన్య సంఘములు

నిర్మాణోద్దేశము:- భోజ్యములు, పానీయములు మొదలగు వస్తువులను జిల్లరగాగొనిన వెల యెక్కువ యియ్యవలసి వచ్చుననుట స్పష్టము. వానిని మొత్తపువెలకుగొన్న నచ్చివచ్చును. మొత్తపు ఖరీదులకు గొనవలయునన్న గొనుమొత్తము గంభీరముగ నుండ